అమరావతి: ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో విడత ఈ నెల 13(శనివారం)న జరగనున్నాయి. ఇదిలా ఉంటే రెండో దశ ఎన్నికల్లో ఎస్ఈసీ ఏకగ్రీవాలను ప్రకటించింది. 13 జిల్లాల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాలో 70, ప్రకాశం జిల్లాలో 69, విజయనగరం జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 57, నెల్లూరు జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 41, కడప జిల్లాలో 40, కృష్ణా జిల్లాలో 36, విశాఖ జిల్లాలో 22, తూర్పుగోదావరి జిల్లాలో 17, పశ్చిమగోదావరి జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని స్పష్టం చేసింది.
0 comments:
Post a comment