గీతలు పడకుండా.. తుడిచేయండిలా!
టీవీపై పడిన దుమ్మూధూళీ, చేతివేళ్ల అచ్చులను తొలగించడానికి దాన్ని తరచూ శుభ్రం చేయాల్సిందే. ఓ వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా... ఇది అనుకున్నంత సులువు కాదు. టీవీని శుభ్రం చేయడానికి రకరకాల పద్ధతులను పాటిస్తాం. అయితే కొన్నింటి వల్ల దానిపై గీతలు పడొచ్చు. ఇలా స్క్రీన్‌ను శుభ్రం చేసే సమయంలో చేసే పొరపాట్లు, ఎలా శుభ్రం చేయాలో చూద్దామా... సాధారణ వస్త్రం వద్దు... కొంతమంది ఇంట్లో ఉండే మామూలు వస్త్రంతో టీవీ అద్దాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దీనికి బదులుగా మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించాలి.
ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఈ వస్త్రం వల్ల టీవీ అద్దంపై ఎలాంటి గీతలూ పడవు. లిక్విడ్స్ నేరుగా వాడొద్దు... ఎల్ఈడీ, ఎల్సీడీ, ప్లాస్మా స్క్రీన్లను తుడవటానికి కొందరు లిక్విడ్స్‌ను వాడుతుంటారు. వీటిలో అమ్మోనియా, ఎసిటోన్, ఆల్కహాల్ లాంటి రసాయనాలుంటాయి. ఇవి అద్దాన్ని పాడు చేస్తాయి. కాబట్టి పొడి మైక్రోఫైబర్ వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. మొండి మరకలు ఉన్నట్లయితే మార్కెట్లో టీవీ, సెల్‌ఫోన్స్, కంప్యూటర్ మానిటర్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన క్లీనింగ్ సొల్యూషన్స్ దొరుకుతాయి.
స్ప్రే చేయొద్దు... స్క్రీన్‌పై ఎలాంటి ద్రవాన్నీ నేరుగా స్ప్రే చేయొద్దు. ఇందుకు బదులుగా ఏదైనా డిటర్జెంట్ లేదా క్లీనింగ్ సొల్యూషన్‌ను మైక్రోఫైబర్ వస్త్రంపై చల్లి దాంతో స్క్రీన్‌ను తుడిస్తే సరిపోతుంది. లిక్విడ్స్‌ను నేరుగా స్క్రీన్‌పై చల్లితే అది లోపలికి పోయి టీవీ, కంప్యూటర్లూ పాడయ్యే ప్రమాదం ఉంది. రిమోట్ కంట్రోల్నూ తుడవాల్సిందే... దీనిపై వేల సంఖ్యలో సూక్ష్మజీవులు పేరుకుని ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేయాడం చాలా అవసరం. ముందుగా దీంట్లోనుంచి బ్యాటరీలు తీసేసి క్లీనింగ్ వైప్స్ లేదా మృదువైన వస్త్రంతో తుడిచేస్తే సరి. స్పీకర్స్... టీవీ స్క్రీన్ తుడిచేటప్పుడు స్పీకర్స్నూ శుభ్రం చేయండి. అయితే తడి వస్త్రాన్ని అస్సలు వాడొద్దు. ఇలాచేస్తే నీళ్లు లోపలికి వెళ్లి టీవీ పాడవ్వొచ్చు.కాబట్టి వీటిని శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్, డస్టర్‌ను వాడండి.
0 comments:
Post a comment