నాడు-నేడు పనుల్లో అక్రమాలపై విచారణ
ఈనాడు-అమరావతి
జిల్లాలో పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. కొన్ని పాఠశాలల్లో సిమెంటు, ఇనుము పక్కదారి పట్టింది. మరికొన్ని చోట్ల చేయని పనులను చేసినట్లు దస్త్రాల్లో చూపి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. క్షేత్రస్థాయిలో అసలు పనుల పురోగతి ఎలా ఉంది.. పనుల్లో నాణ్యత ఎలా ఉందో పరిశీలనకు వెళ్లిన ఉన్నతాధికారులకు ఆయా పాఠశాలల్లో నెలకొన్న స్థితిగతులు చూసి ఆశ్చర్యపోయారు. రాజుపాలెం మండలం పార్వతిపురం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పనులకు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కంప్యూటర్లో అప్లోడ్ చేసిన వివరాలకు చాలా వ్యత్యాసం ఉందని గుర్తించారు. పనులు పూర్తయ్యాయని అధికారులతో నమ్మబలికారు. తీరా ఆ పాఠశాల పరిశీలనకు వెళ్లిన విద్యాశాఖ గుంటూరు జోన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ ఆర్.ఎస్.గంగాభవానీలకు పెద్దమొత్తంలో పనులు అసంపూర్తిగా మిగిలి ఉండడం కనిపించింది. వెంటనే వారు ఈ పనులకు సంబంధించిన రికార్డులను సైతం పరిశీలించారు. ఇనుము లెక్కల్లో తేడాలు కనిపించాయి. ఉండాల్సిన దాని కన్నా ఇనుమ తక్కువగా ఉండడంతో ఆ మొత్తాన్ని సదరు ప్రధానోపాధ్యాయుడు పక్కదారి పట్టించారని అంచనాకు వచ్చారు. ఆర్జేడీ ఆదేశాల మేరకు సదరు హెచ్ఎంపై డీఈఓ సస్పెన్షన్ వేటు వేశారు.
● పిడుగురాళ్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో మరో రెండు, మూడు పాఠశాలల్లో ఉండాల్సిన నిల్వల కన్నా సిమెంటు బస్తాలు తక్కువగా ఉన్నాయని గుర్తించి వివరణ కోరారు. ఆయా మండలాలకు ప్రత్యేక బృందాలను నియమించి ఈ పనుల్లో లోపాలను గుర్తించాలని డీఈఓ ఆదేశాలు జారీ చేయడం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది.
పనుల పర్యవేక్షణకు నియమించిన అధికారులు వీరే..
* బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, పొన్నూరు, రేపల్లె...: పీవీజే రామారావు, బాపట్ల డీవైఈఓ
* యడ్లపాడు, గుంటూరు, తాడికొండ, పెదకాకాని, తుళ్లూరు..: కె.నారాయణరావు, డీవైఈఓ, గుంటూరు డివిజన్
* చేబ్రోలు, దుగ్గిరాల, మంగళగిరి, తెనాలి, అమృతలూరు..: వి.శ్రీనివాస్, డీవైఈఓ, తెనాలి డివిజన్
* కాకుమాను, కర్లపాలెం, నగరం, నిజాంపట్నం, పీవీపాలెం, కొల్లిపర..: ఎస్కే సుభాని, ఏఎంఓ, సమగ్రశిక్ష అభియాన్
* బొల్లాపల్లి, ఈపూరు, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ. నూజెండ్ల, మాచర్ల..: జి.బసవరాజు, సీఎంఓ, సమగ్రశిక్ష
* కొల్లూరు, తాడేపల్లి, చుండూరు, వట్టిచెరుకూరు, వేమూరు, ఫిరంగిపురం, నకిరికల్లు..: జె.రవి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సమగ్రశిక్ష
* కారంపూడి, మాచవరం, ముప్పాళ్ల, పిడుగురాళ్ల, రాజుపాలెం, రెంటచింతల, దుర్గి..: ఎ.ఇమ్మానియేల్, అలెస్కో కోర్డినేటర్, సమగ్రశిక్ష
* అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, దాచేపల్లి, గురజాల, క్రోసూరు, మేడికొండూరు, నరసరావుపేట..: ఎం.మేరీసూజన్, జీడీసీఓ, సమగ్రశిక్ష
* నాదెండ్ల, పెదకూరపాడు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, రొంపిచర్ల..: కె.నాగేంద్రమ్మ, ఐఈడీ కోఆర్డినేటర్, సమగ్రశిక్ష
0 comments:
Post a comment