🔳ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడిటేషన్ తప్పనిసరి
ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యా సంస్థలు వచ్చే మూడేళ్లలో తప్పనిసరిగా న్యాక్, ఎన్బీఏ గుర్తింపు పొందాలని పేర్కొంటూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత విద్యా సంస్థ ప్రారంభమైన తర్వాత మొదటి రెండు బ్యాచ్‌లు బయటకు వెళ్లే లోపు లేదా ఆరేళ్లలో అక్రిడిటేషన్ తప్పనిసరిగా పొందాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలు మూడేళ్లలో న్యాక్, ఎన్బీఏ గుర్తింపు పొందాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపు, నాణ్యమైన విద్యను అందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. అక్రిడిటేషన్ కోసం ఉన్నత విద్యా మండలిలో ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారని, దీనికి సంస్థలు ఒకరిని కేటాయించాలని సూచించారు. న్యాక్, ఎన్బీఏ గుర్తింపు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో ర్యాంకింగ్ సాధించేందుకు విడతల వారీగా విద్యా సంస్థలను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం విద్యా సంస్థలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు
0 comments:
Post a comment