అమరావతి : డిఒపిటి కార్యదర్శికి ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ పై విఆర్ఎస్ ప్రతిపాదనలను ఎస్ఇసి వెనక్కు తీసుకుంది. అభిశంసన ప్రతిపాదనలను కూడా వెనక్కి తీసుకుంది. ఇదివరకు కచ్చితంగా రిటైర్మెంట్ చర్యలు తీసుకోవాలంటూ.. గిరిజా శంకర్, ద్వివేది లపై నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది ఎస్ఇసి పరిధిలో ఉండబోదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలరని పేర్కొంది. ప్రస్తుతం వారిద్దరిపై తాను చేసిన అభిశంసనను వెనక్కు తీసుకుంటున్నట్లుగా ఎస్ఇసి మరో లేఖను కేంద్రానికి పంపారు.
0 comments:
Post a comment