వారు టోల్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరంలేదు.. కేంద్రం ప్రకటన
టోల్ ఫీజుల చెల్లింపు విషయంలో దివ్యాంగులు లేదా అంగవైకల్యం ఉన్నవారికి గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. దివ్యాంగులు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని లోక్సభలో ప్రకటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన గడ్కరీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించారు. వీరికి ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్ ఎత్తివేసినట్టు గుర్తుచేసిన మంత్రి.. ఇకపై వారు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక, యూజర్ ఫ్రెండ్లీ ఉండే రీతిలో దివ్యాంగులకు వాహనాలను డిజైన్ చేయాలంటూ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు గడ్కరీ..
కాగా, టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడమే లక్ష్యంగా కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే నగదు లావాదేవీలను నిలిపివేసి.. పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ ను అమలు చేయనున్న సంగతి తెలిసిందే.
0 comments:
Post a comment