ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం
పోస్టుల బ్లాక్ తో ఉపాధ్యాయుల కొరత
🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభ మయ్యాయి. పారశాల విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు తెరుచుకున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.45 గంటల వరకు తరగతులు జరిగాయి. తొలి రోజు కావడంతో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల చేపట్టిన బదిలీల్లో సుమారు 5వేల పోస్టులను పాఠశాల విద్యాశాఖ బ్లాక్ చేసింది. ప్రతి జిల్లాలో 400 నుంచి 500 పోస్టుల వరకు బ్లాక్ చేశారు కరోనా వల్ల గదికి 20 మంది విద్యార్థులనే ఉంచాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేని పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా వెల్లూర్తి మండలంలోని శ్రీరామపురం తాండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 162 మంది విద్యార్థులు ఉన్నారు. తొలి రోజు 1,3,5 తరగతుల పిల్లలు 80 మంది పాఠశాలకు వచ్చారు. మొత్తం ఆరు ఉపాధ్యాయు పోస్టులు ఈ పాఠశాలకు విద్యాశాఖ మంజూరు చేసింది. మూడు పోస్టులను భర్తీ చేయలేదు. బదిలీలకు ముందు ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యా యులు పనిచేశారు. ఇప్పుడు జరిగిన బదిలీల్లో ఇద్దరు వేరే పాఠశాలకు వెళ్లారు. మిగిలిన ఉపాధ్యాయురాలితో పాటు బదిలీలో కొత్తగా మరోకరు వచ్చారు. ఉపాధ్యాయరాలు మెటర్నటీ సెలవులు ఉండటంతో బదిలీ అయి వచ్చిన ఉపాధ్యాయుడితో మాత్రమే ఆ పారశాల నడుస్తోందికృష్ణాజిల్లాలోని కండ్రిక ప్రాథమికోన్నత పాఠశాలలో 185 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు 10 పోస్టులను విద్యాశాఖ మంజూరు చేసింది. ఐదిలీల్లో 3 పోస్టులు బ్లాక్ చేసింది. మరోకరు బదిలీపై వెళ్లారు. ఇప్పుడు 6గురు ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు మొత్తం 8 తరగతుల విద్యార్థులు ఉంటే కేవలం 5 తరగతి గదులే ఈ పాఠశాలకు ఉన్నాయి. పోస్టులు బ్లాక్ చేయడం వల్ల సరిపడ ఉపాధ్యాయులు లేని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సర్దుబాటు చెప్పిన విద్యాశాఖ ఉపాధ్యాయుల సర్దుబాటు చెప్పలేకపోవడంతో కొంత అయో మయం నెలకొంది. మరో పక్క కరోనా వల్ల చిన్న ప్రైవేట్ పాఠశాలలు దెబ్బతినడం ఇతర కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు పెరి గారు, విద్యాశాఖ మాత్రం ఉపాధ్యాయులను కేటాయించలేక పోయింది తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం విరామం 11.45 నుంచి 12.25 గంటల వరకు, 4,5 తరగతులకు 12.25 నుంచి 1.05 గంటల వరకు వడ్డించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11.45 నిమిషాలకు భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం 3:45 నిమిషాల వరకు ఉండలేకపోతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం పరిశీలించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలో ప్రత్యేక జార్రల పై ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి తెలుసుకుని, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.
0 comments:
Post a comment