ఎన్నికల విధుల్లో ప్రధానోపాధ్యాయురాలు మృతి
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లిలో ఎన్నికలు విధులు నిర్వహణకు వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు దైవ కృపావతి అస్వస్థతతో బుధవారం మరణించారు. ఆమె పోలింగు కేంద్రంలో అసిస్టెంటు రిటర్నింగు అధికారిగా విధులు నిర్వహిస్తూ తీవ్ర అస్వస్థులయ్యారు. దీంతో ఆమెను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం నిమిత్తం పంపారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంనకు చెందిన దైవకృపావతి కాకినాడలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
యూటీఎఫ్ సంతాపం
దైవ కృపావతి మరణించడంతో తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ శాఖ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
0 comments:
Post a comment