సీఎం జగన్ ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ.. గ్రామ వాలంటీర్లు. పార్టీ కోసం పని చేసిన వారికి హెల్ప్ అవుతుందనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థని ఎంకరేజ్ చేస్తున్నారు అనే ఆరోపణలు వచ్చినా.. ఊరూరా ఉద్యోగాలు రావడంతో అంతా హ్యాప్పీనే. ప్రతి ఊరిలోనూ నిరుద్యోగులకు హెల్ప్ అయింది కూడా. గ్రామ వాలంటీర్లు కూడా చాలా యాక్టివ్ గానే ఉన్నారు. అధికార పార్టీ అండ చూసుకుని.. కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. గ్రామాల్లో వాళ్ల సపోర్ట్ జనాలకి చాలా హెల్ప్ అయింది.
అయితే.. సడన్ గా గ్రామ వాలంటీర్లు ఉద్యమ బాట పడుతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. యాక్చువల్ గా అయితే ఇప్పుడు యాక్టివ్ గా లేరు గ్రామ వాలంటీర్లు.
ఎన్నికల టైం కావడంతో.. వారిపై షరతులు వర్తిస్తాయి అని చెప్పింది ఎన్నికల కమిషన్. ఫోన్లు.. ఐడీ కార్డులు తీసుకున్నారు. సో.. వాళ్లకి కూడా కాస్త ఫ్రీ టైం దొరికినట్లుంది. అందుకే అందరూ కలిసి ఉద్యమ బాట పట్టారు. ఇదే విషయంపై సీరియస్ గా డిస్కషన్లు కూడా చేస్తున్నారట. ఆల్రెడీ మ్యాప్ రెడీ అయిందంట. ఇక పోరు బాటకి రెడీ అంటున్నారు.
గుంటూరులోని కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సమావేశం అయిన గ్రామ వాలంటీర్లు.. వారి వారి సమస్యలపై చర్చించుకున్నారు. కలిసి కట్టుగా ముందుకు నడవాలి అని డిసైడ్ అయ్యారు. వారికి చాలీ చాలని జీతాలు ఇస్తూ.. వెట్టి చాకిరీ చేయించుకుంటోందని సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు వాలంటీర్లు. ఐదువేలు జీతం ఇస్తూ అన్ని పనులూ చేయిస్తున్నారని ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఆ ఫ్రస్టేషన్ కే వేదికైంది కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం. రీసెంట్ గా వచ్చిన రేషన్ డోర్ డెలివరీ వాహనాల డ్రైవర్లకి.. 16 వేలు ఇస్తూ.. తమకి మాత్రం 5 వేలే ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తమకి జరుగుతున్న అన్యాయం పై గొంతెత్తున్నారు. తమ జీతాలు కూడా పెంచి.. తమ ఉద్యోగాల్ని క్రమ బద్ధీకరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. చూస్తుంటే.. త్వరలోనే ఉద్యమం మొదలయ్యేలా ఉంది సిచ్చువేషన్. మరి వీరికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.
0 comments:
Post a comment