Bheema Jyoti ఎల్ఐసి నుంచి బీమా జ్యోతి పథకం
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసి బీమా జ్యోతి పేరుతో నూతన పథకాన్ని ఆవిష్కరించింది. ఇది నాన్లింక్డ్, నాన్‌పార్టీస్ పేటింగ్ వ్యక్తిగత పొదుపు పథకమని ఆ సంస్థ తెలిపింది. ఈ పథకం భవిష్యత్‌కు భద్రతతో పాటు పొదుపున కూ అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీపై పాలసీదారుకు గ్యారంటీడ్ సొమ్ము లభిస్తుంది. పాలసీ కాలపరిమితిలో ప్రతి సంవత్సరాంతానికి సమ్ అస్యూర్డ్‌లో ప్రతి రూ.1000 కనీసం రూ.50 అదనంగా జమవుతుందని తెలిపింది. కనీస సమ్ అస్యూర్డ్ రూ.లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల కాలపరిమితితో పాలసీని తీసుకోవచ్చు. 90 రోజుల వయసు నుంచి 60 ఏళ్ల లోపు వయసు వారు ఈ పాలసీ కొనుగోలుకు అర్హులు.
రిస్క్ ప్రారంభమయ్యాక పాలసీ కాలంలో దురదఅష్టవశాత్తూ పాలసీదారు మరణిస్తే.. నిబంధనల ప్రకారం బీమా విలువతోపాటు, అప్పటివరకూ జమ అయిన అదనపు మొత్తాన్ని చెల్లించనుంది.
0 comments:
Post a comment