ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర ఆసక్తి పెంచిన తొగరాం ఫలితం త్వరగానే వచ్చేసింది. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస మండలం తొగరాం పంచాయతీ సర్పంచ్ ఎన్నికపై ఎందుకు ఇంత ఆసక్తి అంటే.. అక్కడ సాక్షాత్తు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం భార్య వాణీ సీతారం పోటీ చేయడమే. అయితే ఆమె పోటీ చేస్తున్నది కూడా తోడి కోడలు పైనే కాడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పంచాయతీపై అందరికీ ఆసక్తి పెరిగింది.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణీ సీతారాం వైసీసీ మద్దతుతో బరిలోదిగితే. టీడీపీ మద్దతుతో తమ్మినేని అన్నయ్య దివంగత శ్యామలరావు సతీమణి భారతమ్మ బరిలో నిలిచారు. దీంతో తోడికోడళ్ల మధ్య రసవత్తర పోరు సాగుతోందని రాజకీయ పరిశీలకులు భావించారు.
చాలా చోట్ల ఈ సారి తోడికోడళ్ల మధ్య పోరు సర్వసాధారణమే.. అయితే తొగరాం స్పీకర్ సొంత గ్రామం కావడం.. ప్రత్యర్థి పార్టీ మద్దతుతో వదిన పోటీలో ఉండడం, ఆమె గతంలో ఎంపీపీగా మండలాన్నిఅభివృద్ధి చేశారనే పేరు ఉంది. దీనికి తోడు జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ విప్ కూన రవికుమార్ భారతమ్మ విజయం కోసం విశేషంగా కృషి చేయడంతో అందరీ ఫోకస్ దీనిపై పడింది. ప్రచారం కూడా ఇద్దరూ పోటీ పడీ మరీ నిర్వహించారు. ఇద్దరు కీలక నేతలు అక్కడే మాకం వేసి ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకునే వారు.
స్పీకర్ సీతారం సైతం తన భార్య విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఎదురైంది. గతంలో సీతారాం తల్లి ఇందుమతి ఎంపీటీసీగా పోటీ చేయగా భారతమ్మ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన భార్య విజయం సాధిస్తేనే రాష్ట్ర స్థాయిలో తన పరువు నిలుస్తుందని ఆయన పట్టుదలగా పావులు కదిపారు. .10 రోజులుగా గ్రామంలోనే బసచేసి వ్యూహాలు రచించారు. మరోవైపు తన పట్టును నిలుపుకునేందుకు రవికుమా ర్ కూడా భారతమ్మ విజయానికి అవసరమైన కృషి చేశారు. ఈ పంచాయతీకి చెందిన ఓటర్లు వివిధ జిల్లాల్లో ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ మద్దతుదారులు విజయం సాధించేందుకు బావ, బావమరుదులు సీతారాం, రవికుమార్ ఎత్తులకు పైఎత్తులు వేశారు.
అత్యంత ఆసక్తి పెంచిన ఈ ఎన్నికల్లో సీతారాం భార్య వాణి సీతారం విజయం సాధించారు.. ఆమె ప్రత్యర్థి భారతి పై 540 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతకుముందే ఈ పంచాయతీలో వార్డులన్నీ ఏకగ్రీవం చేసుకోగలిగారు స్పీకర్. గతంలో స్పీకర్ తల్లి ఓటమికి.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ఫలితాలో ప్రతీకారం తీర్చుకోగలిగారు.
0 comments:
Post a comment