టోక్యో : ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే ఔషధాలు, యాంటీబయాటిక్స్ అభివృద్ధి అనంతరం మానవాళి దీర్ఘకాలం జీవిస్తున్నా సంతోషంగా బతకడం జపనీయుల నుంచి నేర్చుకోవాలి. ఎక్కువ కాలం బతకడమే కాదు నాణ్యతతో కూడిన ఆరోగ్యకరమైన జీవితం గడిపామా అనేదే కీలకం. మంచి కుటుంబం, స్నేహితులు, ఆరోగ్యకర వాతావరణం, ఇష్టమైన పనులు చేయడం ఇవన్నీ అందిపుచ్చుకుంటూ దీర్ఘకాలం జీవించడం మనలో చాలా మంది కోరుకుంటారు. నవ్వుతూ బతకడమే జీవితం ఉద్దేశమని 112 ఏండ్ల 344 రోజుల వయసుతో గత ఏడాది గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కిన జపనీస్ వ్యక్తి చెబుతారు.
జపాన్ పత్రిక నిప్పన్ టైమ్స్ కథనం ప్రకారం జపాన్‌లో 2019లో సగటు ఆయుప్రమాణం మహిళల్లో 87.45 ఏండ్లు కాగా, పురుషుల్లో 81.41 ఏండ్లు. ఇక డబ్ల్యూహెచ్ఓ 2019 తాజా నివేదికలో జపాన్‌లో సగటు ఆయుప్రమాణం 83.7 ఏండ్లు కాగా మహిళల్లో 86.8 ఏండ్లు పురుషుల్లో 80.5 ఏండ్లుగా పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా పురుషుల సగటు ఆయుప్రమాణం 69.1 ఏండ్లు కాగా, భారత్‌లో ఇది 69.16 ఏండ్లుగా ఉంది. మరోవైపు జపాన్‌లో ప్రజలు దీర్ఘకాలం సంతోషంగా బతకడానికి వారి ఆహారం, వ్యాయామం, సాంస్కృతిక వ్యవహారాలు, జన్యు కారణాలు వంటి ఎన్నో అంశాల కలబోతే కీలకమని ఏ ఒక్క కారణం వారికి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు దోహదపడలేదని నిపుణులు చెబుతారు.
జపనీయుల దీర్ఘ ఆయుప్రమాణానికి కారణాలివే..
కడుపు మొత్తం ఆహారం నింపకుండా 20 శాతం ఖాళీగా ఉంచడం
మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, పారిశుద్ధ్యం
కొద్ది కొద్దిగా మెల్లిగా తినడం, కుటుంబం అంతా కూర్చుని తినడం
సమతుల ఆహారం, సీ ఫుడ్, పండ్లు, చేపలు, రైస్, పప్పు ధాన్యాలు, సోయా, లో క్యాలరీ డైట్
యాంటీఆక్సిడెంట్స్‌తో కూడిన ప్రాచీన హెర్బల్ టీ
నడక, నిరంతర వ్యాయామం
పూర్వీకుల నుంచి సంక్రమించిన జీన్స్
వృద్ధుల పట్ల కరుణ, ప్రేమ
ఒక ఆశయం కోసం జీవించడం
0 comments:
Post a comment