మనం కాలేజీ లైబ్రరీ నుంచి గానీ, ప్రైవేట్ లైబ్రరీ నుంచి పుస్తకం తీసుకున్నప్పుడు.. వాటిని పలానా తేదీలోగా తిరిగి ఇవ్వాలని చెప్తారు. ఆ గడువులోగా ఇవ్వకపోతే జరిమానా విధిస్తారు. అలాగే, పుస్తకం కనిపించకుండా పోయినపక్షంలో దాని ఖరీదును మన నుంచి వసూలు చేస్తుంటారు. అయితే, సిడ్నీకి చెందిన ఓ లైబ్రరీలో ఓ అరుదైన సంఘటన జరిగి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
సిడ్నీ నివాసి జోర్డాన్ మ్యూజిక్సిన్ అనే వ్యక్తి ఇటీవల తన ఇంట్లో ఒక పురాతన లైబ్రరీ పుస్తకాన్ని కనుగొన్నాడు. దాన్ని చూడగానే జార్డాన్కు ఎక్కడలేని ఆశ్చర్యమేసింది. ఎందుకంటే.. ఈ పుస్తకం దాదాపు 82 సంవత్సరాల క్రితం నాటిది.
జోర్డాన్ మ్యూజిక్సిన్..
హ్యూ లోఫ్టింగ్ రాసిన 'ది అడ్వెంచర్స్ ఆఫ్ డాక్టర్ డోలిటిల్' అనే పుస్తకాన్ని తన ఇంట్లో అటకపై ఇన్సులేషన్ కింద గుర్తించాడు. పాత సిడ్నీ పబ్లిక్ లైబ్రరీ నుంచి 1939 లో ఈ పుస్తకం తీసుకున్నట్లు గుర్తించాడు. అనంతర కాలంలో 1959 లో లైబ్రరీ ఉన్న భవనం అగ్నికి ఆహుతై 80 వేలకు పైగా పుస్తకాలు ధ్వంసమయ్యాయి. వాటిలో చాలా అరుదైన, విలువైన వస్తువులు కూడా ఉన్నాయి.
జేమ్స్ మెక్కానెల్ స్మారక గ్రంథాలయాన్ని మరుసటి సంవత్సరం మేలో ప్రారంభించారు. గోప్యత కారణంగా ఈ పుస్తకం తీసుకున్న వ్యక్తికి సంబంధించి విషయాలను వెల్లడించడం లేదని మ్యూజిక్సిన్.. కేపె బ్రెటన్ రీజనల్ (సీబీఆర్) లైబ్రరీ ఇన్స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేశారు. అయితే, ఈ పుస్తకం తీసుకున్న మహిళ పేరులోని మొదటి అక్షరాలు వీఎం అని ఉన్నాయని, ఆమె 1920 లో జన్మించిందని, ఈ పుస్తకాన్ని తీసుకున్న సమయంలో ఆమె సిడ్నీలోని సెంటర్ స్ట్రీట్లో నివసించేవారని, ఒకవేళ మీరు గుర్తిస్తే మాత్రం మాకు మెయిల్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గమ్మత్తేంటంటే.. సదరు గ్రంథాలయం నిర్వాహకులు ఈ పుస్తకానికి జరిమానా విధించడం గత ఏడాది నిలిపివేశారంట. 82 ఏండ్ల క్రితం తీసుకున్నప్పటికీ ఈ ఒక్క పుస్తకానికే ఎలాంటి జరిమానా విధించలేదని మ్యూజిక్సిన్ పేర్కొన్నారు.
0 comments:
Post a comment