✍8 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్
♦శింగనమల హెచ్ఎంపై చర్యలు
🌻అనంతపురం విద్య: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి స్పాజ్ కోటాను దుర్వినియోగం చేసిన 8 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈఓ శామ్యూల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పాజ్ పనిచేస్తున్న మండలం కాకుండా తమకు నచ్చిన మండలాల్లో స్థానాలను ఎంపిక చేసినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకు న్నారు. దీంతో స్పౌజ్ కోటాను దుర్వినియోగం చేసి సస్పెండ్ అయిన ఉపాధ్యాయుల సంఖ్య 15కు చేరింది. మరో వ్యవహారంలో గ్రేడ్-2 హెచ్ ఎంను సస్పెండ్ చేశారు. తాజాగా సస్పెండ్ అయిన వారిలో గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్ ఎంపీపీ పాఠశాల టీచర్లు జి.స్వరూపా రాణి, శ్రీదేవి, గార్లదిన్నె పాత కల్లూరు ఎంపీపీ పాఠశాల టీచర్ సి.లక్ష్మీదేవి, గార్లదిన్నె మండలం జంబులదిన్నె ఎంపీపీ పాఠశాల టీచర్లు సీకే లావణ్య, పి.చెన్నకేశవులు, పెనుకొండ మండలం కొం డాపురం ఎంపీపీ పాఠశాల టీచర్ ఎన్ .చంద్రకళ కూడేరు మండలం గొటుకూరు ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు కే.ఖాదర్ బాషా, గార్లదిన్నె మండలం సిరివరం ఎంపీపీ పాఠశాల టీచర్ పి.ఉమాదేవి ఉన్నారు. మరోవైపు బదిలీల్లో స్పౌజ్ కోటా ఉపయోగించుకున్న వారి దరఖాస్తుల పరి శీలన ఇంకా కొనసాగుతుండగా...ఇంకెంతమందిపై వేటు పడుతుందోనన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. కాగా ప్రస్తుతం సస్పెండ్ అయిన వారందరినీ మడకశిర, అగళి, గుడిబండ మండలాల్లోని నాలుగో కేటగిరి స్థానాలకు బదిలీ చేయనున్నారనే సమాచారంతో వారంతా హడలిపోతున్నారు.
♦శింగనమల హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు
ఇక మరో ఘటనలో శింగనమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రేడ్-2 హెచ్ ఎం ఎం. సుజా తమ్మ సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో కోడిగుడ్లను విద్యార్థులకు సరఫరా చేయకుండా నిల్వ ఉంచి అవి మురిగిపోయేందుకు కారణమై నందున ఆమెపై చర్యలు తీసుకున్నారు.
0 comments:
Post a comment