📚✍మే 3 నుంచి వార్షిక పరీక్షలు
♦ఎస్.సి.ఇ.ఆర్.టి. డైరెక్టరు ప్రతాప్‌రెడ్డి
🌻శావల్యాపురం, న్యూస్‌టుడే : దేశ చర్రితలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు వర్క్‌బుక్స్ అందజేశామని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసేందుకు సీసీఆర్టీ విధానం ప్రవేశ పెట్టినట్లు ఎస్.సి.ఇ.ఆర్.టి. డైరెక్టరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం శావల్యాపురం జడ్పీ పాఠశాలను ఆయనతో పాటు, ఆర్జేడీ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో గంగాభవాని ఆకస్మాత్తుగా సందర్శించారు. ముందుగా పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ప్రధానోపాధ్యాయుని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మే 3 నుంచి 10 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, రాబోయే అకడమిక్ సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక తయారు చేస్తామని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు మే నెలలో పాఠ్యాంశాలపై రివిజన్ చేపట్టి, జూన్ మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఆర్జేడీ రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నాడు- నేడు పనులను ఈ నెలాఖారుకు పూర్తి చేయాలని, ఏప్రిల్ 15 నుంచి రెండోదశ పనులు ప్రారంభం అవుతాయని, జిల్లా మొత్తం మీద నాడు- నేడు పనులకు సంబంధించి రూ.10 కోట్లు మాత్రమే బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. డీఈవో గంగాభవాని మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల హాజరు కేవలం రిజిష్టరులో మాత్రమే కాకుండా అంతర్జాలంలో నమోదు చేస్తామని, దీని వల్ల విద్యార్థుల గైర్హాజరు తగ్గుతుందని, విద్యార్థి పాఠశాలకు రాకపోతే సంబంధిత గ్రామ వాలంటీరు వెళ్లి విద్యార్థి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని, వారు లేకపోతే సీఆర్పీ, ఉపాధ్యాయుడు వెళ్లాలని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రణాళిక అందజేశామని, వారికి ప్రతిరోజు అదనపు తరగతులు, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
♦పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
స్థానిక జడ్పీ పాఠశాలలో రూ.80 లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ఆర్జేడీ, డీఈవో పరిశీలించారు. గుత్తేదారునితో డీఈఓ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపిస్తే ఊరుకోమని, దీర్ఘకాలంగా ఉండాల్సిన పనులు నాణ్యత లేకుండా చేపడితే ప్రభుత్వ వ్యయం వృథా అవుతుందని తెలిపారు. పనులపై థర్డ్ పార్టీతో తనిఖీ చేయిస్తామని, నాణ్యత లోపిస్తే బిల్లులు మంజూరు ఆపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఎం.సాంబశివరావు, ప్రధానోపాధ్యాయుడు పులిపాటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
0 comments:
Post a comment