📚✍ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫీజు చెల్లింపు గడువు 25 వరకు పెంపు
🌻అమరావతి, ఆంధ్రప్రభ: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును 25వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్, గతంలో తప్పిన విద్యార్థులతో పాటు హ్యుమానిటీస్(కళాశాల అధ్యయనంతో) సమూహ మార్పుతో హజరయ్యే విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.సాధారణ, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు సైతం పరీక్ష ఫీజు రుసుము చెల్లింపు గడువు పెంపును వర్తింప చేయాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు రామకృష్ణ తెలిపారు.
0 comments:
Post a comment