🌼పది’ పరీక్షకు అదనపు సమయం ఉంది
🎯త్వరలో సవరణ ఉత్తర్వులు
☀️పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు 3.15గంటల సమయం ఇచ్చేందుకు త్వరలో సవరణ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అర్ధ గంట సమయం పెంచేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుబ్బారెడ్డి వెల్లడించారు
☀️విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకటించినట్లే వంద మార్కులకు నిర్వహించే అయిదు సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయని పేర్కొన్నారు. సామాన్య శాస్త్రంలో పేపర్-1(భౌతిక, రసాయన శాస్త్రం), పేపర్-2 (జీవశాస్త్రం) విడివిడిగా 50మార్కులకు పరీక్షలు ఉన్నందున ఈ రెండింటికి 2.45గంటల సమయమే ఉంటుంది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల వరకు రెండు రోజులు పరీక్షలు నిర్వహిస్తారు.
0 comments:
Post a comment