📚✍10 విద్యార్థుల వయసు మినహాయింపునకు సూచనలు✍📚
🌻ఏలూరు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 9 : ఈ ఏడాది జూన్లో నిర్వహించనున్న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్గా హాజరయ్యే విద్యార్థులు గతేడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 14 సంవత్సరాల వయసు నిండి ఉండాలని డీఈవో సీవీ రేణుక మంగళవారం తెలిపారు. ఏ విద్యార్థికైనా ఏడాదిన్నర వయసు తక్కువైతే వయసు కండోనేషన్ నిమిత్తం ప్రతిపాదనలను ఈ నెల 20వ తేదీలోగా ఏలూరు డీఈవో కార్యాలయంలో అందజేసి అనుమతి పొందాలని సూచించారు. ఎన్ఆర్ డేటాను ఆన్లైన్లో సమర్పించినప్పుడు వయసు కండోనేషన్ అనుమతి పొందిన ప్రొసీడింగ్స్ కాపీ, మునిసిపల్/పంచాయతీ అధికారుల నుంచి పొందిన పుట్టిన తేదీ సర్టిఫి కెట్లను విధిగా అప్లోడ్ చేయాలన్నారు. వయసు కండోనేషన్ రుసుం రూ.300లను సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించాలని సూచించారు.
0 comments:
Post a comment