🌼1005 మంది గురువులకు శ్రీముఖాలు
విశాఖ
☀️పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం, హాజరు తదితర వివరాలు ఐఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా 1005 మంది ఉపాధ్యాయులకు డీఈఓ లింగేశ్వరరెడ్డి శ్రీముఖాలు పంపించారు. ‘యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సిన మీ విధిలో నిర్లక్ష్యం వహించారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో 24 గంటల్లో వివరణ ఇవ్వాలి’ అని అందులో పొందుపరిచారు.
☀️ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగదు: ఉపాధ్యాయులపై యాప్‌ల పేరుతో పని ఒత్తిడి పెంచడం ద్వారా విద్యా బోధనకు ఆటంకం కలుగుతుందని, ఇది మంచి పరిణామం కాదని ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. గాజువాక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ఉపాధ్యాయుల శిక్షణ సమావేశంలో ఆయన ముఖ్యఅథితిగా మాట్లాడారు. పని భారంతో కొందరు యాప్‌లలో వివరాలు నమోదు చేయలేని కారణంగా అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు.
0 comments:
Post a comment