Wedding Card: వెడ్డింగ్ కార్డు వెరైటీ. ఐతారం నాడు లగ్గం అంటూ పిలుపు. భాష.. యాసలో పెళ్లి కారట..
ఓ శుభలేఖ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందా అని ఆలోచిస్తున్నారా..? భాషకు, యాసకు పట్టం కట్టి… పెళ్లి కారట కొట్టిచ్చిల్లు… లగ్గానికి రాండ్రి అని పిలుపిచ్చిల్లు… అందుకే ఆ పెళ్లి శుభలేఖ వైరల్ అవుతోంది.
మొన్నామధ్య పెళ్లి కార్డుతో పాటు భోజనం పంపిచ్చిళ్లు… నిన్న పెళ్లి కారటతో పాటు మందు, మంచింగ్ ఇచ్చిల్లు… కానీ గీ పెళ్లి కార్డుతో ఏమీ పంపలే… కానీ ఆ పెళ్లి కార్డు వైరల్ అయింది. కారణం.. పెళ్లి శుభలేఖలో వాడిన భాషే. పరాయి సంస్కృతి మోజులో పడి మాతృ భాషను మర్చిపోతున్న వేళలో… మాతృ భాషతో పాటు యాస పదాలతో ముద్రించి శుభలేఖ అందరిని ఆకట్టుకుంటోంది. అందులో ''… వారి పెండ్లి పిలుపు, ఆహ్వానించువారు, విందు, స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, కనిష్ఠ పుత్రుడు, గరిష్ఠ పుత్రిక, కల్యాణ వేదిక'' వంటి పదాలేం వాడలేదు.
అంతా తెలంగాణ వాడుక భాషలోనే ''లగ్గం పిలుపు, పిలిశెటోళ్లు, బువ్వ, ఐతారం అంబటాల్లకు 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, లగ్గం యాడనో ఎర్కనా'' వంటి పదాలతో వినూత్నంగా రూపుదిద్దిన ఈ శుభలేఖ తెలంగాణ యాసను ప్రతిబింబించేలా ఉంది.
కార్డు ఎవరిదంటే…
'మై విలేజ్ షో'లో ఓ ఆర్టిస్ట్ అయిన చంద్రమౌళి (చందు).. వినూత్నంగా తన వివాహానికి ఇలా శుభలేఖను తయారు చేయించుకున్నారు. కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన కొందరు యువకులు మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానెల్ నడిపే సంగతి తెలిసిందే. ఇందులో వచ్చే షార్ట్ ఫిల్ముల్లో చందు నటిస్తుంటారు. అయితే, ఈ శుభలేఖను చందు ట్విటర్‌లో ఉంచడంతో అది వైరల్‌గా మారింది. ఎంతో మంది ఈ శుభలేఖను చూసిన వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
0 Comments:
Post a Comment