తెలంగాణలో పీఆర్సీపై వేసిన త్రిసభ్య కమిటీ చర్చలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇప్పటివరకు 11 సంఘాలతో చర్చలు జరిపిన సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ. ఇవాళ మరో మూడు సంఘాలతో చర్చలు జరుపుతోంది. చర్చల అనంతరం పీఆర్సీపై ఫైనల్ నోట్‌ను రేపు సీఎం కేసీఆర్‌కు పంపే అవకాశాలున్నాయి. మరోవైపు బిశ్వాల్ కమిటీ సిఫార్సులను ససేమిరా అంగీకరించమంటోన్న ఉద్యోగ సంఘాల నేతలు సీఎం అపాయింట్మెంట్ ఇస్తే తమ సమస్యలు చెబుతామంటున్నారు. అయితే సీఎం ఉద్యోగ సంఘాలతో చర్చిస్తారా లేదా అనే క్లారిటీ కమిటీ ఇవ్వటం లేదంటున్నారు.
0 comments:
Post a comment