Andhra Pradesh Ration: ఇకపై రేషన్ షాపుల వద్ద సరుకుల కోసం వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు నంబర్ చెప్పి..ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ చెబితే పని అయిపోతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటీపీ పద్ధతిలో సరకులను అందజేసేందుకు పౌరసరఫరాల శాఖ రెడీ అయ్యింది. ఫిబ్రవరి నుంచి ఈ విధానాన్ని అమలు చెయ్యనుంది. ఇప్పటికే రేషన్ డీలర్లకు ఆదేశాలు అందాయి. లబ్ధిదారుల ఆధార్‌తో ఫోన్ నంబర్ లింక్ అయిందో లేదో పరిశీలించి..ఒకవేళ లింక్ కాకుంటే మీ- సేవ, ఈ- సేవా కేంద్రాలకు వెళ్లి అనుసంధానం చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు.
ఇప్పటికే పలు చోట్లు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఓటీపీ పద్ధతి ద్వారా సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ డిసైడయ్యింది.
ఈ క్రమంలో వచ్చే నెల నుంచి రేషన్ తీసుకోవాలంటే ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటేనే రేషన్ సరకులు తీసుకునేందుకు వీలవుతుంది. రేషన్ షాపు వద్దకు సరుకులు కోసం వెళ్లే లబ్ధిదారులు డీలర్‌కు తమ ఆహార భద్రత కార్డుకు సంబంధించిన నాలుగు చివరి నంబర్లు చెప్పాలి. ఈ- పాస్ మెషీన్‌పై కార్డు నంబర్లు ఫీడ్ చేస్తే సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పగానే డీలర్ దానిని ఫీడ్ చేస్తే సరుకుల పంపిణీకి అనుమతి లభిస్తుంది.
0 Comments:
Post a Comment