న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం.. అటుపై విశ్వాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది ఆటోమొబైల్ సేల్స్ దాదాపు కుదేలయ్యాయి. అదే కరోనా ప్రభావంతో వ్యక్తిగత వాహనాలకు పెరిగిన ప్రధానం.. ఇటీవల ఫెస్టివల్ సీజన్‌లో డీసెంట్ సేల్స్ నమోదయ్యాయి. ప్రత్యేకించి గతేడాది చివరి రెండు నెలలు.. నవంబర్, డిసెంబర్‌ల్లో ఆటోమొబైల్స్‌లో కార్లు, టూ వీలర్స్ సేల్స్‌లో రెండంకెల వృద్ధిరేటు నమోదైంది.
గతేడాదితో పోలిస్తే 2021లో నూతన ఆవిష్కరణలు.. సేల్స్ మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. నూతన మోడల్ కార్లు, టూవీలర్స్ ఆవిష్కరణకు 2021 సాక్షిగా నిలువనున్నది. ఆటోమొబైల్ ప్రేమికులకు 2021 తప్పనిసరిగా ఆశ్చర్యకర ఆవిష్కరణలు అందుబాటులోకి తేనున్నది.
ఈ క్రమంలో విపణిలోకి రానున్న టాప్-5 ఎస్‌యూవీ మోడల్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం..
ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే నాడు టాటా మోటార్స్ తన హారియర్ ఎస్‌యూవీ మోడల్ కారు న్యూ త్రీ రో వర్షన్ టాటా గ్రావిటాస్ మోడల్ కారును ఆవిష్కరించనున్నది. విపణిలోకి అడుగు పెట్టేందుకు వీలుగా ఇప్పటికే కార్ల తయారీ ప్రారంభించినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.
ఇందులో హారియర్‌లో మాదిరిగానే ఎఫ్‌సీఏ-సోర్స్‌డ్ 2.0-లీటర్ల క్ర్యోటెక్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. 350 ఎన్‌ఎం పీక్ టార్చితోపాటు గరిష్ఠంగా దీని సామర్థ్యం 170 పీఎస్ పవర్ దీని సొంతం. టాటా మోటార్స్ 1.5-లీటర్ల డైరెక్ట్- ఇంజెక్షన్ ఫోర్ సిలిండర్ యూనిట్‌ను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీని విద్యుత్ సామర్థ్యం 150 పీఎస్‌గా ఉంటుంది.
ఇంకా టాటా మోటార్స్ మైక్రో-ఎస్‌యూవీ కాన్సెప్ట్ కారును విపణిలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీన్ని 'హోంబిల్' అని పిలుస్తారని తెలుస్తున్నది. వచ్చే మే నెలలో వినియోగదారులకు టాటా 'హోంబిల్' పరిచయం కానున్నది. ఇది అత్యంత చౌక ఎస్‌యూవీ మోడల్ కారుగా నిలువనున్నది.
ఆల్ఫా (ఏజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్) ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి రానున్నది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతోపాటు ఏడు అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హర్మాన్ కార్డోన్ ప్రీమియం ఆడియో సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు జత కలిశాయి. విపణిలో అడుగుపెట్టిన తర్వాత మారుతి సుజుకి ఇగ్నీస్, మహీంద్రా కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ మోడల్ కార్లకు సవాల్ విసరనున్నది.
మరో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా రెండోతరం ఎక్స్‌యూవీ 500 ఎస్‌యూవీ కారు వచ్చే ఏప్రిల్‌లో ఆవిష్కరించనున్నారు. ఆటోమొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహనం మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఒకటి కానున్నది.
ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫ్లాట్ బాటమ్డ్ స్టీరింగ్ వీల్, డిజిటల్ మల్టీ ఇన్‌ఫో డిస్‌ప్లే (ఎంఐడీ), ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సెకండ్ జనరేషన్ ఎక్స్‌యూవీ 500 మోడల్ కారును మహీంద్రా అండ్ మహీంద్రా లెవెల్ వన్ ఆటానమస్ టెక్నాలజీతో ఆవిష్కరించనున్నది.
చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ తయారీ సంస్థ స్కోడా తన తొలి కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ఆవిష్కరించడానికి సిద్ధమైంది. 2019 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన స్కోడా విజన్ ఐఎన్ ఈ ఏడాది ప్రారంభంలో విపణిలోకి రానున్నది.
ఈ మోడల్ కారు రెండు డిఫరెంట్ పవర్‌ట్రైన్స్ మోడళ్లు.. 1.0- లీటర్ల త్రీ సిలిండర్ టీఎస్‌ఐ-పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ టీఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ వర్షన్లతో వినియోగదారులను పలకరించి, ఆలరించనున్నాయి. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఆప్షనల్ సెవెన్ స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ కలిగి ఉన్నాయి.
మరో ప్రముఖ ఆటోమేకర్ వోక్స్ వ్యాగన్ గతేడాది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టైగూన్ ఎస్‌యూవీ మోడల్ కారు టీజర్ ఇమేజ్‌లు ఇప్పటికే లీకయ్యాయి. జర్మనీ ఆటో మేకర్ అయిన వోక్స్ వ్యాగన్.. భారతీయ ఆటోమొబైల్‌రంగంలో కంపాక్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నది.
విపణిలోకి ఆవిష్కరించిన తర్వాత దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్లు క్రియా సెటోస్, హ్యుండాయ్ క్రెటా మోడల్ కార్లకు తైగూర్ గట్టి సవాల్ విసరనున్నది. జర్మనీలో అత్యంత చౌక ఎస్‌యూవీ మోడల్ కారుగా నిలిచింది.
0 Comments:
Post a Comment