State Bank Of India: కస్టమర్లకు తీపికబురు అందించిన SBI.. నగదు డిపాజిటర్లకు సూపర్ భెనిఫిట్..
State Bank Of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సంక్రాంతి కానుకగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదేంటంటే.. ఫిక్స్డ్ డిపాజిట్ FD రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. అయితే సెలక్ట్ చేసిన వారి టైంలిమిట్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి బెనిఫిట్ కలుగుతుంది. రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించింది. జనవరి 8 నుంచి వడ్డీ రేట్ల ఈ అంశం అమలులోకి రానుంది. అంతేకాకుండా వచ్చే రెండెళ్ళలోపు కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
ఇక తాజాగా నిర్ణయం ప్రకారం ఎఫ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన ఎస్బీఐ, ఇక రెన్యూవల్ చేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్లకు కూడా ఇది వర్తించనుంది.
2020 సెప్టెంబర్ 10న ఫిక్స్డ్ డిపాజిట్లను సవరించింది. రేట్లు పెంచిన తర్వాత బ్యాంకుల్లో పిక్స్డ్ డిపాజిట్ల రేట్లు వారం రోజుల నుంచి 45 రోజుల టైం లిమిట్లోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 2.9 శాతంగా ఉంది. ఇక 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.9 శాతం వడ్డీ వస్తుంది. 180 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సంవత్సరం నుంచి రెండేళ్ళలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ వస్తుంది. అలాగే రెండేళ్ళ నుంచి మూడేళ్ళ లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.1 శాతం వడ్డీ శాతం పొందొచ్చు. 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.3 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఐదేళ్ళ నుంచి పదేళ్ళలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అంతేకాకుండా వృద్ధులు కూడా అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీని పొందవచ్చు.
0 Comments:
Post a Comment