Sourav Ganguly: సౌరభ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. ఆస్పత్రికి తరలింపు
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తారని తెలుస్తోంది.
గుంగూలీకి గుండె పోటు వచ్చిందన్న వార్త తనను బాధించిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు
గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. గంగూలీ హయాంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. గంగూలీ 113 టెస్ట్, 311 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 11,363 పరుగులు చేశారు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్ట్‌ల్లో 7,212 రన్స్ సాధించారు గంగూలీ. ఇందులో 16 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ గంగూలీకి మంచి రికార్డే ఉంది. వన్డేల్లో 100, టెస్టుల్లో 32 వికెట్లను పడగొట్టారు ఈ బెంగాల్ దాదా. 2012 వరకూ ఐపీఎల్‌లోనూ ఆడారు. 2008-10 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, 2011-12 వరకు పుణె వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
0 comments:
Post a comment