SBI Home Loan 2021: హోమ్ లోన్‌పై వడ్డీ రేటును భారీగా తగ్గించిన ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే హోమ్ లోన్లపై అనేక ఆఫర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హోమ్ లోన్ కస్టమర్లను ఆకర్షించేందుకు వడ్డీ రేటును భారీగా తగ్గించింది. ఏకంగా 30 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీని తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. అంతేకాదు... ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం తొలగిస్తున్నట్టు కూడా తెలిపింది. కస్టమర్లకు 2021 మార్చి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఇళ్లు కొనాలనుకునే సామాన్యులతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతుగా నిలుస్తామని ఎస్‌బీఐ ప్రకటించింది. కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి మాత్రమే కాదు, ఇప్పటికే హోమ్ లోన్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా టాప్ అప్ హోమ్ లోన్ ఇస్తామని ఎస్‌బీఐ ప్రకటించింది.
యోనో యాప్ ద్వారా కొన్ని క్లిక్స్‌తో టాప్ అప్ లోన్‌కు అప్లై చేయొచ్చని తెలిపింది.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్‌పై 6.80 శాతం వడ్డీని ఛార్జ్ చేస్తోంది. ఈ వడ్డీ రేట్లు సిబిల్ స్కోర్‌కు లింక్ అయి ఉంటాయి. క్రెడిట్ స్కోర్ బాగా ఉన్న కస్టమర్లకు 6.80 శాతం వడ్డీ వర్తిస్తుంది. రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకునేవారికి 6.80 శాతం నుంచి, రూ.30 లక్షల కన్నా హోమ్ లోన్ తీసుకుంటే 6.95 శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతాయి. దేశంలోని 8 మెట్రో సిటీస్‌లో రూ.5 కోట్ల వరకు లోన్ తీసుకునేవారికి 30 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ తగ్గుతుంది. ఇక మహిళలకు 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గించింది ఎస్‌బీఐ. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి కూడా 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గుతుంది. కస్టమర్లు యోనో యాప్ లేదా https://homeloans.sbi/ లేదా https://www.sbiloansin59minutes.com/ వెబ్‌సైట్లలో హోమ్ లోన్‌కు అప్లై చేయొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా హోమ్ లోన్‌కు అప్లై చేస్తే మరో 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గుతుంది.
కొద్ది రోజుల క్రితం హోమ్ లోన్‌పై ఇతర ఆఫర్స్‌ను ఎస్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సీజన్ మొదలవుతుండటంతో హోమ్ లోన్‌పై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. ప్రాసెసింగ్ ఫీజును కూడా తొలగించింది ఎస్‍బీఐ. అంటే హోమ్ లోన్ ప్రాసెస్ చేయడానికి కస్టమర్లు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది.
0 Comments:
Post a Comment