ఐఆర్‌సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చిసింది. అయితే కొన్నిసార్లు ఎక్కువమంది టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్ అవ్వడం లేదా స్లో అవ్వడం జరుగుతుంది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. పలు ఫిర్యాదులు అందిన అనంతరం ఇండియన్ రైల్వేస్ ఈ-ఆర్‌సీటీసీ ఇటికెటింగ్ వెబ్‌సైట్, యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కొత్త సైట్‌తో పాటు యాప్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ కొత్త వెబ్‌సైట్ చాలా సులభతరంగా..అందరికీ అర్థమయ్యేలా ఉంది. రైలు ప్రయాణం చేసేవారు కొత్త ఫీచర్ల వల్ల రిఫండ్ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు.
సైబర్ సెక్యూరిటీ కూడా ఉంటుంది.
మీల్స్, రూమ్, హోటల్స్ వంటివి కూడా డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు.
రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తకూడదనే లక్ష్యంతో సరికొత్త వెబ్‌సైట్, యాప్‌ను తెచ్చామని పీయూష్ గోయల్ తెలిపారు. ఐఆర్‌సీటీసీని యాక్టీవ్‌గా వినియోగించే యూజర్స్ 6 కోట్ల మంది ఉన్నారు. ప్రతి రోజు దాదాపు 8 లక్షలకు పైగా టికెట్లు బుక్ అవుతూ ఉంటాయి. రిజర్వేషన్ చేసే టికెట్లలో 83 శాతం ఐఆర్‌సీటీసీ ద్వారానే బుక్ అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కొత్త వెబ్‌సైట్, యాప్ ద్వారా రెగ్యులర్, ఫేవరెట్ జర్నీని ఆటోమేటిక్‌గానే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ సెర్చ్, సెలక్షన్ కూడా సులభతరంగానే ఉంటుంది. ఏ ఏ ట్రైన్లలో ఏ ఏ తరగతిలో సీట్లు అందుబాటులో ఉన్నాయో చూసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
0 Comments:
Post a Comment