RBI: త్వరలో రిజర్వ్ బ్యాంక్ నుంచి Bitcoin తరహాలో డిజిటల్ కరెన్సీ విడుదల...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి త్వరలోనే తన డిజిటల్ కరెన్సీని దేశంలోకి తీసుకురావడానికి ఆలోచిస్తోంది. పేమెంట్స్ పరిశ్రమ వేగంగా మారుతున్న నేపథ్యంలోలో, ప్రైవేట్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రాక, అలాగే కాగితపు నోట్లు లేదా నాణేల నిర్వహణకు సంబంధించిన ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో తన సొంత డిజిటల్ కరెన్సీని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా కేంద్ర బ్యాంకులు డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని ఆలోచిస్తున్నాయని ఆర్బిఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ యొక్క అవకాశాలను అధ్యయనం చేయడానికి మరియు వాటికి మార్గదర్శకాలను రూపొందించడానికి ఆర్బిఐ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీని ఏర్పాటు చేసింది.
బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీల నిర్వహణకు వెన్నెముకగా నిలిచే బ్లాక్‌చెయిన్ లేదా పంపిణీ లేజర్ టెక్నాలజీని పరిశీలించాలని కమిటీకి సూచించింది. వీటి ద్వారా స్థూల ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత లభించనుంది. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం కోసం దీనిని ప్రోత్సహించాలని సంబంధింత అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
సిబిడిసి అంటే ఏమిటి CBDC ఒక చట్టపరమైన కరెన్సీ, ఇది సార్వభౌమ కరెన్సీగా గుర్తిస్తారు. డిజిటల్ రూపంలో ఉండే కరెన్సీకి డిజిటల్ బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. ఇది బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో నమోదు చేస్తారు. ఇది ఎలక్ట్రానిక్ కరెన్సీకి రూపం, దీనిని ఆర్బిఐ జారీ చేసే నగదుగా మార్చవచ్చు. లేదా మార్పిడి చేయవచ్చు.
ఇవి ప్రయోజనాలు...
సోర్సెస్ ప్రకారం, డిజిటల్ కరెన్సీ ఆచరణలోకి వస్తే, నగదు లావాదేవీల పద్ధతులను మార్చవచ్చు. అలాగే ఇది నల్లధనాన్ని అరికడుతుంది. డిజిటల్ కరెన్సీ ద్రవ్య విధానాన్ని అనుసరించడం సులభతరం చేస్తుందని కమిటీ పేర్కొంది. ఇందులో డిజిటల్ లేజర్ టెక్నాలజీ (డిఎల్‌టి) వాడాలి. డిఎల్టితో విదేశాలలో లావాదేవీలను గుర్తించడం సులభం అవుతుంది.
0 comments:
Post a comment