Primary Schools Opening: ప్రాథమిక పాఠశాలల రీఓపెనింగ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపడతామని పేర్కొన్నారు.
తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గదులు సరిపడని చోట రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించడం జరగుతుందని మంత్రి సురేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే పాఠశాలలకు విద్యార్థులను అనుమతించడం జరుగుతుందని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే తొమ్మిది, పది తరగతులతో పాటు కాలేజీ విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే.
0 comments:
Post a comment