MLC By-Elections: ఏపీలో ఎమ్మెల్సీ బై-ఎలక్షన్కు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..
MLC By-Elections: టీడీపీ నుంచి వైకాపాలోకి చేరిన పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. శాసనసభ్యుల కోటాకు చెందిన ఈ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ జనవరి 11న విడుదల కానుండగా.. నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జనవరి 18గా నిర్ణయించారు. ఇక నామినేషన్ల పరిశీలన జనవరి 19, విత్ డ్రా జనవరి 21 కాగా.. ఎన్నికల పోలింగ్ జనవరి 28న ఉంటుందని.. అదే రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
0 comments:
Post a comment