Minister KTR Praices a Boy Talent: మనదేశంలో పల్లెల్లో ప్రతిభకు కొదవులేదు.. అయితే ఆ ప్రతిభ గుర్తించి వారికి తగిన విధంగా ట్రైనింగ్ ఇస్తే.. దేశానికి పేరు తెస్తారు అని చుసిన వారందరూ భావిస్తారు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ అందం కనిపించినా .. ఎవరిలో ఏ స్పెషాలిటీ దాగున్నా దానిని వీడియో గా తీసి సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అలా ఓ బాలుడు జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్లో పల్టీలు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ బాలుడి వీడియోను చూశారు.
ఆ బాలుడి టాలెంట్‌కు ఫిదా అయ్యారు. ఆ బాలుడిలో అద్భుతమైన టాలెంట్ ఉందని.. ఇది తనకు సండే మోటివేషన్ గిప్ట్ అని.. అతడి గురించి తెలిస్తే చెప్పాలని ట్వీట్ చేశారు. అతడిని ప్రోత్సహిస్తే.. తప్పక ఒలంపిక్ పతకాన్ని తీసుకువస్తాడన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.అతను తెలంగాణకు చెందిన బాలుడా.. లేక దేశంలో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు కానీ మీలో ఎవరికైనా ఈ బాలుడి జాడ తెలిస్తే చెప్పండన్నరు కేటీఆర్ . మరి కేటీఆర్ మనసు దోచిన ఆ బుడతడి ప్రతిభపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి
0 comments:
Post a comment