Highlights of the video conference on Nadu - Nedu
మనబడి నాడు-నేడు నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశములు
ముఖ్యాంశములు
చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఎట్టి పరిస్థితుల్లో మావద్ద డబ్బులు లేవు కాబట్టి పెయింటింగ్ వెయ్యవద్దని చెప్పకూడదు.
డబ్బులు లేకపోతే రివైజ్డ్ సాంక్షన్ తీసుకోవాలి.
కాబట్టి వచ్చిన పెయింటింగ్ వారి చేత రంగులు వేయించాలి.
వాల్ ఆర్టులు ప్రాథమిక పాఠశాలలకు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రమే వెయ్యాలి.
కాంపౌండ్ వాల్స్ కి కేవలం ఎంట్రన్స్ లో గేటుకి అటూ ఇటూ ముందు భాగంలో మాత్రమే రంగులు వేయాలి.
గతంలో బాగా మంచి వాల్ ఆర్టులు వేసినవి మార్చక్కర్లేదు.. పైన ఒక కోటింగ్ రంగు వేస్తే సరిపోతుందని చెప్పారు.
కొద్ది రోజుల్లో రిపోర్ట్ 4.12 స్కూల్ school analysis పెడతారు. కాబట్టి అన్ని పాఠశాలలు HM LOGIN లో school analysis పూర్తి చేయాలి.
APEWIDC వారు టీవీ సరఫరాలకు ఇన్వాయిస్లు అప్లోడ్ చేయడానికి ప్రధాన బాధ్యులు.(కస్టోడియన్)
టీవీలో పక్కన స్విచ్ఛ్ బోర్డు లు ఖచ్చితంగా పెట్టాలి.
గౌరవ ముఖ్యమంత్రివర్యులు తదుపరి సమీక్షా సమావేశం లో ఎన్ని పాఠశాలలు ఎన్నెన్ని కాంపోనెంట్లు పూర్తి చేసారు.. అసలు పూర్తి చేయని పాఠశాలలు ఎన్ని అనే విషయాలను అడుగుతామని పాఠశాల విద్యాశాఖ కు తెలియజేసారు.
వర్క్ క్లోజ్ అంటే ఫీల్డ్ లెవెల్ లో పని పూర్తి చేయడం.. ఎక్సపండీచర్ బుక్ చేయడం.. ఫొటోలు అప్లోడ్ చేయడం.
School analysis ఇంకా చాలా మండలాల్లో జరుగటలేదని తెలియజేసారు.
తక్కువ ఖర్చుతో కూడుకున్న పనులకు మాత్రమే రీ ఎస్టిమేట్స్ ఇవ్వమన్నారు.
మండలాలను రెండు పెయింటింగ్ కంపెనీలకు (ఏషియన్ మరియు బెర్జర్) వారికి పెంచుతారు.
నాడు-నేడు ఫొటోలు ఖచ్చితమైనవి పంపమన్నారు.
50 నాడు-నేడు ఫొటోలు అంటే 5 పాఠశాలల వి ఒకే డైమన్షన్ లో ఉండేవి పంపాలి.. నాడు లో మార్పులు చేసినవి నేడులో చూపించాలి. నేడు ఫొటోలు నాడుకంటే బాగుండాలి.
వాల్ ఆర్టులు లోకల్ ఆర్ట్ టీచర్లు చేత చేయించవలెను.
రెండు మూడు రోజుల్లో రివాల్వింగ్ ఫండ్స్ జమవుతాయని తెలియజేసారు.
ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు చిన్న చిన్న పనులు తక్షణమే పూర్తి చేయాలని కనీస రంగులతో పాఠశాలల సుందరీకరణ పూర్తి చేయాలని తెలియజేసారు.
తొమ్మిది జనవరి 2021 .. పది జనవరి 2021 పాఠశాలలకు సెలవలు.
పదకొండు జనవరి 2021 పని దినము
12-01-2021 నుంచి 17--01-2021 వరకు పాఠశాలలకు సెలవలు
అమ్మ ఒడి కార్యక్రమం ఈ సంవత్సరం 11-01-2021న ప్రారంభించబడును.
11-01-2021 ఉదయం పదకొండు గంటలకు మండల స్థాయిలో ఎక్కడైనా శాశన సభ్యులు చేత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించాలని అదే సభలో గౌరవ ముఖ్యమంత్రివర్యులచేత ప్రారంభించబడే కార్యక్రమం చూడడానికి సభలో పెద్ద టీవీ లు పెట్టాలి..
అమ్మ ఒడి కార్యక్రమం ప్రతీ పాఠశాలలో జరపాలని తెలియజేసారు.
జిల్లా స్థాయి లో కూడా అమ్మ ఒడి కార్యక్రమం చేయాలి.
ఈ సంవత్సరం అమ్మ ఒడి లబ్ధిదారులకు పద్నాలుగు వేలు ఇచ్చి మిగిలిన వెయ్యి రూపాయలు టాయిలెట్స్ నిర్వహణ నిమిత్తం పాఠశాలల పిసీ ఖాతాలకు జమచేయడం జరుగుతుందని తెలియజేసారు. ఈ ఫండ్ కేవలం టాయిలెట్స్ నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలి. ఇంకే పనికి ఉపయోగించకూడదు.
ఇట్లు,
జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షా, విశాఖపట్నం.
0 Comments:
Post a Comment