ప్రభుత్వ పరీక్షలు డైరెక్టర్ (DGE) శ్రీ సుబ్బారెడ్డి గారు ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సంఘ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యాంశాలు.
ముఖ్యాంశాలు
1) 10 వ తరగతి పరీక్షలు ప్రకటన (Notification) ఫిబ్రవరి 15 వ తేదీ లోగా వస్తుంది. వీలయితే ఇంకా ముందు వచ్చే అవకాశం కూడా ఉందని DGE గారు తెలిపారు.
2) ఒక వారం రోజులలో 10 వ తరగతి సిలబస్, మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్ పై స్పష్టత ఇస్తామని తెలియజేశారు.
3) విద్యార్థులు సంఖ్య CSE, SSC LOGIN లో, DY. EO ల వద్ద సమానంగా ఉండేలా చూడాలన్నారు.
4) గుర్తింపు/RENEWAL పొందని పాఠశాలల కు నామినల్ రోల్ OPEN అవ్వదని స్పష్టంగా తెలియజేశారు.
5) అవసరమైన పాఠశాలలు ADDITIONAL సెక్షన్స్ కు సంబంధిత అధికారులు నుండి అనుమతి తప్పనిసరిగా పొంది ఉండాలి. లేనిచో అదనంగా ఉన్న విద్యార్థులు కు NR OPEN కాదని స్పష్టంగా తెలిపారు.
6) గతంలో తెలుగు మీడియం కు పొందిన అడిషనల్ సెక్షన్స్ ను ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సర్దుబాటు చేయడం కుదరదని స్పష్టంగా తెలియజేశారు.
7) ఆన్లైన్ లో విద్యార్థులు వివరాలు నమోదు(SUBMIT) చేసిన అనంతరం , దాని ప్రింట్ మరియు MNR లను పోస్ట్ ద్వారా HM లు SSC బోర్డ్ కు డైరెక్ట్ గా పంపించాలని తెలిపారు. *DY.EO/DEO ఆఫీస్ కు సమర్పించవలసిన పనిలేదని తెలిపారు.
8) NR ను నింపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ADMISSION రిజిస్టర్ ఆధారంగా మాత్రమే వివరాలు ను నమోదు చేయాలని తెలిపారు.
ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ లేదా మరే ఇతర వాటి ని ఆధారంగా వివారాలు నింపకూడదు.
తప్పులు వ్రాసిన యెడల ప్రధానోపాధ్యాయులు కు/ కరెస్పాండెంట్ కు జరిమానా విధించబడునని స్పష్టంగా తెలిపారు.
9) PH సర్టిఫికెట్ ఒరిజినల్ పంపించాలని తెలిపారు.
10) మైగ్రేషన్ సర్టిఫికెట్ కావాల్సిన విద్యార్థుల కొరకు పరీక్ష ఫీజు తో పాటు మైగ్రేషన్ సర్టిఫికెట్ కొరకు కూడా రుసుము చెల్లించేవిధంగా ఆప్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
పాస్ అయిన తర్వాత ఆ ఆప్షన్ ఇచ్చిన వారికి 10 వ తరగతి సర్టిఫికెట్ తో పాటు మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా వస్తుంది అని తెలిపారు.
11) అధికారిక సమాచారం కోసం bse.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని, వాట్సాప్ ద్వారా లో వచ్చిన message ను నమ్మవద్దని తెలిపారు.
12) డూప్లికేట్ పాస్ సర్టిఫికెట్ ఇక మీదట ప్రింట్ కాపీ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
13) పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలో, 11 పేపర్స్ లేక 6 పేపర్స్ అనేది ప్రభుత్వం నుండి సమాచారం రావాల్సి ఉందని కూడా తెలిపారు. త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు
0 comments:
Post a comment