confusion among students on the 10th Class Syllabus
పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్న పాఠాలపై గందరగోళం నెలకొంది. సిలబస్లో ఏ పాఠాలు ఉన్నాయి. ఏవి లేవో అనే అంశంపై వారిలో అయోమయం నెలకొంది కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు సగం విద్యా సంవత్సరం ఇంటికే పరిమితమయ్యారు. కొంతమంది ఆన్లైన్ టివి, రేడియో తరగతులను ఫాలో అయ్యారు. అప్పటి వరకు తరగతి గదిలో బోధనకు అలవాటుపడ్డ విద్యార్థులు ఆన్లైన్ పై అంతగా దృష్టి సారించలేకపోయారు. తరగతి గదిలో బోధన జరకపోవడంతో 30శాతం సిలబస్ ను రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా మండలి (ఎస్ సిఇఆర్టి) తగ్గించింది. మొత్తం ఆరు యూనిట్ల సిలబస్లో ఒక యూనిట్ సిలబస్ ఎస్సీఆర్టీ కుదించింది. సిలబస్లో ఏ పాఠాలు తగ్గాయి అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది. ఎస్ సిఇఆర్ట్ క్యాలెండర్ లో పాటు సొంతంగా రూపొందించిన మెటీరియలను కూడా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు బోధిస్తున్న పరిస్థితినెలకొంది. దీంతో పరీక్షలకు ఏ పాఠాలు ఫాలో అవ్వాలో అర్ధం కాని పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది.
పరీక్షలెప్పుడు?
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఏటా మార్చిలో జరిగే పరీక్షల షెడ్యూల్ ను నాలుగు/ఐదు నెలల ముందుగా విద్యాశాఖ విడుదల చేస్తోంది. ఈసారి కరోనా వల్ల బోధన కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఏప్రిల్, మేలో జరుపుతామని ప్రకటించిన మంత్రి షెడ్యూల్ను వారంలో విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. అయినా ఇప్పటికీ షెడ్యూల్ విడుదల కాలేదు. మరోపక్క పరీక్షలను విద్యాశాఖ ఎన్ని పేపర్లలో నిర్వహిస్తుందోననే అంశం పై స్పష్టత లేదు. సైన్స్ ను రెండు పేపర్లుగా, మిగిలిన సబ్జెక్టులను ఒక్కొక్క పేపర్ గా మొత్తం ఏడు పేపర్లలో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. పేపర్లను కుదిస్తే అందుకు సంబంధించిన నమూనా ప్రశ్నాపత్రాలను ఎస్సిజఆర్టి విడుదల చేయాలి. పరీక్షల షెడ్యూల్ ను త్వరగా విడుదల చేసి, నమూనా ప్రశ్నాపత్రాలను కూడా విడుదల చేస్తే విద్యార్థులు పరీక్షలకు సిద్దమవ్వడానికి ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
0 comments:
Post a comment