విద్యార్థులకు అలర్ట్.. CBSE, NEET, IIT, JEE పరీక్షలపై తాజా అప్డేట్ ఇదే....
కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని పరీక్షలు ఆలస్యమయ్యాయి. సీబీఎస్సీ 10, 12 బోర్డు పరీక్షలు, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ 2021, నీట్ 2021, ఇంకా అనేక రాష్ట్ర ప్రభుత్వాల బోర్డు పరీక్షల షెడ్యూల్ పై కరోనా ఎఫెక్ట్ పడింది. క్లాసులు సరిగా జరగకపోవడం, ప్రిపేర్ కావడానికి సరైనంతగా సమయంలో లేక పోవడంతో పరీక్షలను జూన్ వరకు వాయిదా వేయాలని అనేక మంది విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కొన్ని పరీక్షల తేదీలను విడుదల చేసింది.
కొన్ని వారాల క్రితం నేషినల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్ 2021 పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షను నాలుగు సార్లు నిర్వహించనున్నారు.
మొదటి పరీక్షను ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనుంది. జేఈఈ మెయిన్ అభ్యర్థులు 90 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది.
ఈ పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ ఈ నెల 7న ప్రకటించనున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలకు అనుసరించనున్న విధానాన్ని సైతం ఆయన వివరించనున్నారు. జేఈఈ మెయిన్ 2020 పరీక్షలో క్వాలిఫై అయి జేఈఈ అడ్వాన్స్డ్ 2020 పరీక్షకు హాజరు కాలేకపోయినవారు నేరుగా జేఈఈ అడ్వాన్స్ డ్ 2021 పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. జూన్ 10న పరీక్షలు ముగుస్తాయన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ రోజు మాట్లాడారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. జూలై 15న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మే 1న ప్రారంభం అవుతాయని వివరించారు. కేంద్ర మంత్రి ప్రకటనతో పరీక్షలపై విద్యార్థుల సందేహాలు, అనుమానాలు తీరాయి. అయితే పరీక్షలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ప్రిపరేషన్ కు సమయం సరిపోతుందా? లేదా? అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) 2021 పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. నీట్ ప్రవేశ పరీక్ష 2021 తేదీలను ప్రకటించాలని విద్యార్థులు కోరుతున్నారు.
0 Comments:
Post a Comment