💁♀️గ్రామాల్లో "అమ్మఒడి"కి నేతలు వద్దు..
🔰ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడొద్దు..
🔰తల్లిదండ్రులు, సిబ్బందితోనే నిర్వహణ..
🔰పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు..
🍁అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి):
🔰‘అమ్మఒడి’ రెండో విడత కార్యక్రమం సోమవారం ప్రారంభవుతున్న నేపథ్యంలో గ్రామాల్లోని పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కారాదని పాఠశాల విద్యాశాఖ సూచించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, కోడ్ ఉల్లంఘనకు పాల్పడవద్దని హెచ్చరించింది. హెడ్మాస్టర్, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాప్, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు మాత్రమే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పట్టణాల్లోని స్కూళ్లలో జరిగే కార్యక్రమాలకు రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవచ్చని పేర్కొంది. ఇక, ఈ కార్యక్రమాల్లో పాఠశాలలో శానిటేషన్ నిర్వహణకు సంబంధించి హెడ్మాస్టర్ వివరించాలని విద్యాశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ రక్షణ చర్యలు తీసుకోవాలని, అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ను అమలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ సర్క్యులర్లో వివరించారు.
0 comments:
Post a comment