💁♀️కాంట్రాక్ట్ జేఎల్ల పదవీ విరమణ వయసు పెంపు..
🔰58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం..
సాక్షి, అమరావతి:
🔰రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్టు టైమ్ జూనియర్ లెక్చరర్ల (జేఎల్ల) పదవీ విరమణ వయసును ప్రభుత్వం 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. ఈమేరకు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
🔰రాష్ట్రంలో 3,720 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, 90 మంది పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లు ఉన్నారు.
🔰ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వీరి కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రభుత్వం తమ పదవీ విరమణ వయసును పెంచడంపై కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై.రామచంద్రారెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్ రెడ్డి, కోశాధికారి కరీంఖాన్ హర్షం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
🔰ఇందుకు సహకరించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఇంటర్ విద్య కమిషనర్ రామకృష్ణలకు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డికి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపింది.
0 comments:
Post a comment