గతంలో జరిగిన విషయాలు పక్కనపెట్టి పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయన బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. “గవర్నర్ తో ఈ రోజు భేటీ జరిగింది. గవర్నర్ గారు ఈ రోజు పిలిచారు. ప్రభుత్వంతో ఉన్న సమస్యలు ఏంటి.. అని అడిగారు. నేను కచ్చితంగా ప్రభుత్వం, ఎస్ ఈసీ మధ్య వివాదాలు లేకుండా పరిష్కరిస్తానని చెప్పారు.” అని నిమ్మగడ్డ విలేకరుల ముందు చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, “సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసింది. సీఎస్, డీజీపీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు అధికారులతో ఎలాంటి సమస్య లేదని చెప్పాను.
ఉద్యోగుల సంఘాలు విధుల్లో పాల్గొనటం స్వాగతిస్తున్నాను." అని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. "ఈ రోజు 11 గంటలకు సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చ జరిగింది. ఈ రోజు నుంచి లక్షణ రేఖ వచ్చింది. ఎన్నికల కమిషన్ ను నిందించడం తగదు. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. గవర్నర్, సీఎస్ కు ఇదే చెప్పాను. ఇద్దరు అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటే.. మంత్రి వ్యాఖ్యలు బాధాకరం.” అని నిమ్మగడ్డ అన్నారు. తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. “3.60 లక్షల యువత ఓటు హక్కు కోల్పోయారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది వాస్తవం. వారిని అభిశంసన చేశాము. వారిని ఏమీ సస్పెండ్ చేయలేదు. కక్ష సాధింపు లేదు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఆధ్వర్యంలో నడిచింది. గతం గురించి వద్దు..అధికారులకు కూడా అదే చెప్పాను." అని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ ముగించారు.
To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Follow by Email

0 comments:
Post a comment