ఉద్యోగులు, పింఛనుదారులకు కరువుభత్యం...
న్యూఢిల్లీ : ఉద్యోగులు, పింఛనుదారులకు కొత్త కరువుభత్యం(డీఏ) ఈ(జనవరి) నెలలోనే అందే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా కరువుభత్యం నాలుగు శాతం వరకు పెరగవచ్చని వినవస్తోంది.
ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు ఈ పెరిగిన డీఏ ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కిందటి సంవత్సరం మార్చి నెలలో డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది జనవరి నుంచే పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. డీఏను 4 శాతం పెంచారు. దీంతో డీఏ 21 శాతానికి చేరింది.
అయితే కరోనా వైరస్ కారణంగా డీఏ పెంపు అమలు కాలేదు. డీఏ పెంపును అమలుచేస్తే... దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరో 65 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది.
0 comments:
Post a comment