అమరావతి : రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌పై ఎస్ఇసి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ప్రభుత్వం తిప్పిపంపింది. ఐఎఎస్ అధికారులపై ప్రొసీడింగ్స్ (అభిశంసన ఉత్తర్వులు)ను జారీచేసే అధికారం ఎస్ఇసికి లేదని తేల్చి చెప్పింది. అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా ప్రొసీడింగ్స్‌ను జారీ చేసే అధికారం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఓటరు జాబితా తయారీలో పంచాయితీరాజ్ శాఖాధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల విధులకు పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు అనర్హులని మంగళవారం ప్రొసీడింగ్స్ జారీ చేశారు. సర్వీసు రికార్డుల్లో రిమార్కులను నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎస్ఇసి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను తిప్పి పంపింది. కాగా, 2019 నాటి ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరపడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 3.60 లక్షల మంది యువత తమ ఓటు హక్కును కోల్పోనుంది. అధికారులపై జారీ చేసిన అభిశంసన ప్రొసీడింగ్స్‌ను కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖకు పంపింది.
0 comments:
Post a comment