అమరావతి: ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫోటోలు, పార్టీ గుర్తులు ఉండరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం గతంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇంటింటికి రేషన్ పథకం అమలుకు అనుమతి ఇవ్వాలని అందులో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్ వాహనాల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
కార్యక్రమ వివరాలతో 2 రోజుల్లో ఎస్ఈసీని సంప్రదించాలని తెలిపింది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అని ప్రభుత్వ కోర్టుకు వివరించిన నేపథ్యంలో.. ఎస్ఈసీ 5 రోజుల్లో నిర్ణయం తెలపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
This comment has been removed by the author.
ReplyDelete