న్యూఢిల్లీ : బంగారం కొనాలనుకుంటున్నారా ? అయితే... వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఆ దుకాణాలకు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్ళాల్సిందే. లేకపోతే... బంగారం కొనుగోలు చేయలేదు.
అంటే బంగారం దుకాణానికి వెళ్ళే సమయంలో...పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి తీసుకువెళ్ళడం ఇక తప్పనిసరి అన్నమాట. ఎందుకంటే... బంగారం కొనుగోలుదారుల నుంచి... వ్యాపారులు... కేవైసీ డాక్యుమెంట్లు తీసుకుంటున్నారు. రానున్న బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం... బంగారం కొనుగోళ్ళకు సంబంధించి కేవైసీ డాక్యుమెంట్లను తప్పనిసరి చేసే అవకాశముందని జువెలర్లు చెబుతున్నారు.
'ఎకనమిక్ టైమ్స్' కథనం మేరకు... కేంద్ర ప్రభుత్వం జువెలరీ రంగానికి మనీ ల్యాండరింగ్ చట్టాన్ని వర్తింపజేసిన నాటినుంచి బంగారం వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.
ఏమైనా అనుమానిత లావాదేవీలు కనిపిస్తే ప్రభుత్వ ఏజెన్సీల వల్ల ఇబ్బందులు రావొచ్చని జువెలర్లు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే జువెలరీ సంస్థలు ప్రతి లావాదేవీని ఇకపై ప్రభుత్వ ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏమైనా అవకతవకలుంటే ఆయా జువెలరీ ప్రతినిధులను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపధ్యంలోనే... జువెలరీ సంస్థలు రూ. 2 లక్షల లోపు కొనుగోళ్లకు కూడా కేవైసీ డాక్యుమెంట్లు అడుగుతున్నారు. కాగా... కొనుగోలుదారుల్లో మాత్రం ఈ అంశంపై కొంత గందరగోళం చోటుచేసుకుంటోంది.
0 Comments:
Post a Comment