🔳పురపాలక ఉపాధ్యాయులకు ఆంగ్లంపై శిక్షణ
సీఎం సమక్షంలో కేంబ్రిడ్జి వర్సిటీతో ఒప్పందం
పురపాలక ఉపాధ్యాయులకు ఆంగ్లంపై శిక్షణ
ఈనాడు, అమరావతి: పురపాలక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఆంగ్ల భాష నైపుణ్యం పెంపొందించేందుకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో పురపాలక శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పురపాలక బడుల్లో పని చేస్తున్న 12,378 ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. ఇందుకోసం రాష్ట్రంలో 14 లాంగ్వేజ్ ల్యాబ్ (భాషా ప్రయోగశాలలు)లు ఏర్పాటు చేయనున్నారు. ఆంగ్లంతోపాటు సైన్సు, గణిత సబ్జెక్టులలోనూ శిక్షణ ఇస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కేంబ్రిడ్జి వర్సిటీ ఈ శిక్షణను ఉచితంగా అందించనుంది. వర్చువల్ తరగతులు నిర్వహించేందుకు విశాఖపట్నం, విజయవాడ, కర్నూలులో మూడు స్టూడియోలను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, పురపాలక శాఖ కమిషనర్ విజయ్‌కుమార్, పురపాలక శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment