అమ్మఒడి జాబితాల పునఃపరిశీలన
త్రిసభ్య కమిటీ ఏర్పాటు
🌻ఒంగోలు విద్య, జనవరి 3 : అమ్మఒడి జాబితాల పునఃపరిశీలనకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. తల్లి ఆధార్ నంబర్‌తో సరిపోలని విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలించనుంది. అలాంటి కేటగిరీ కింద జిల్లాలో 11,450 మందిని గుర్తించి వారి వివరాలను సంబంధిత పాఠశాలల, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల లాగిన్‌లో ఉంచినట్లు డీఈవో సుబ్బారావు చెప్పారు. వారి వివరాల పరిశీలనకు ప్రధానోపాధ్యాయుడు / ప్రిన్సిపాల్, గ్రామ/వార్డు సచివాలయ ప్రతినిధి, తల్లిదండ్రులు కమిటీ ప్రతినిధితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీరు ఆయా ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్స్ లాగిన్‌లో ఉన్న విద్యార్థులు, తల్లులు వివరాలు పరిశీలించి అవి సక్రమంగా ఉంటే వాటిని ధ్రువీకరించాలని సూచించారు. ఏమైనా తేడా ఉంటే పునఃపరిశీలనకు సిఫార్సు చేయాలన్నారు త్రిసభ్య కమిటీ ఆమోదం పొందిన విద్యార్థుల వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమతమ అమ్మఒడి లాగిన్‌లలో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమం మొత్తం సోమవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన తల్లులందరికీ తప్పనిసరిగా లబ్ధి చేకూరేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రి వెరిఫికేషన్ కి చర్యలు..
ఆ రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?
💐ఫ్లాష్...జగనన్న అమ్మఒడి పథకానికి సంభందించి రీ వెరీఫికేషన్ కొరకు 3Steps ఇవ్వడం జరిగింది, కొత్త Process ప్రకారం Re Verification సబ్మిట్ చేసే విధానం, సబ్మిట్ చేసిన తర్వాత PDF DOCUMENT డౌన్లోడ్ చేసి, ఆ PDF ను 3MEMBERS కమిటీ చేత ఆన్లైన్ లో అప్లోడ్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియోను పూర్తిగా చూడండి*
https://youtu.be/wMuZ86cj3Ow
💐అమ్మ ఒడి వివరాల పరిశీలనకు కమిటీలు
★స్టెప్ 1 : Reverfication process
◆స్టెప్2:Generate reverfied List in PDF
●స్టెప్3: UPLOAD Reverfication PDF Dacument(signed and stampcopy)..
0 Comments:
Post a Comment