గౌస్ లాజమ్ కు సావిత్రిబాయి పూలే ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ హానర్ అవార్డ్
ఓబులదేవరచెరువు మండలం లోని కమ్మవారిపల్లె ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గౌస్ లాజమ్ కు సావిత్రిబాయి పూలే ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ హానర్ అవార్డ్ 2020 అవార్డుకు వీరిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వల్లూరి ఫౌండేషన్ వారు ఎంపికచేశారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ కలిగి అనేక సామాజిక కార్యక్రమాలు సేవలు చేశారు. కరోనా కాలంలో చాలామందికి తనవంతుగా సహాయం చేశారు. వీరి సేవలను మరియు సామాజిక కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వల్లూరి ఫౌండేషన్ వారు ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డును వర్చువల్ ఈవేంట్ ద్వారా ఇవ్వడం జరిగింది అని , ఎంపిక చేసిన చైర్మన్ వి.ఆర్. శ్రీనివాస్ కి అవార్డు గ్రహీత కృతజ్ఞతలు తెలియజేశారు.
0 Comments:
Post a Comment