ప్రపంచ కుబేరుడిని చైనా చంపేసిందా?? దొరకని జాక్ మా ఆచూకీ!
ప్రపంచంలో అపర కుబేరులు ఒకరు ఆసియాలోనే అతి పెద్ద కుబేరుడిగా పేరుగాంచిన ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు చైనాకు చెందిన జాక్ మా జాడ రెండు నెలలుగా కనిపించడం లేదు. చైనా ఆర్ధిక విషయాలన్నీ చక్కదిద్దే 4 బ్యాంకులు తీరు అవి అనుసరిస్తున్న విధానం గురించి బహిరంగంగా విమర్శించిన దగ్గర నుంచి ఆయన జాడ కనిపించకుండా పోయింది. ఒకవేళ ఉన్నారా లేక చైనా ప్రభుత్వం అతన్ని చంపేసిందా లేక జైల్లో పెట్టింది అనేది ఎవరికీ అంతుబట్టని విధంగా ఉంది. చైనాలో ఎంతో ఎత్తుకు ఎదిగి తక్కువ సమయంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మొత్తం దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే సత్తా గల నాయకులు ఇతర వ్యక్తులు ఎవరైనా సరే చైనా ప్రభుత్వం ఇలా మాయం చేయడం అలవాటే.
వారిని ఉంచితే జైల్లో పడేస్తుంది లేదా చంపేస్తోంది. ఇప్పుడు అదే కోవలోకి ఆలీబాబా కంపెనీల వ్యవస్థాపకుడు చేరారు. చైనాలో ఒక వ్యక్తిని సంస్థను ఒక స్థాయి వరకు మాత్రమే వెల్లనిస్తారు. అక్కడ నుంచి వారు కొందరిని ప్రభావితం యేసే వ్యక్తులుగా ఎదిగితే చైనా నియంతృత్వ ప్రభుత్వం వారిని ఉపేక్షించదు.
** గతంలోనూ మైల్స్ క్వాక్ అనే అతిపెద్ద పారిశ్రామిక వేత్త సైతం చైనా ప్రభుత్వం నిందలు వేధింపులు భరించలేక అత్యంత రహస్యంగా మెరుగ్గా పారిపోయారు. అక్కడినుంచి క్వాక్ చైనాలో ఏం జరుగుతుంది ఎప్పుడు ఎవరు బలి అయిపోతారు అన్న విషయాలను ప్రతి దాంట్లోనూ చెబుతూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చైనాలో ఎవరు మాయం అవుతారు అనేది ఆయన జ్యోతిష్యం చెబుతారు. జాక్ మా విషయంలో మైల్స్ క్వార్క్ ముందుగానే నవంబరులో చైనాకు చెందిన అతిపెద్ద ధనవంతులు ఒక రూపాయి అవుతున్నారని నాలుగు నెలల ముందే చెప్పాడు. ఇప్పుడు అదే నిజమైంది. ఆదర్శవంతుడు జాక్ మా అని ఇప్పుడు చైనాలో చెవులు కొరుక్కుంటున్నారు.
ఎందుకు అంటే..!
జాత్ మర అదృశ్యం వెనుక అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చైనాలో మాత్రం నియంతృత్వం ధాటికి ఎవరైనా సరే ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. జాక్ మా ఓ సమావేశంలో బహిరంగంగా చైనాలోని నాలుగు బ్యాంకులు వ్యాపారవేత్తలకు కేవలం డబ్బులు ఇచ్చి తీసుకుంటున్న సంస్థలు గానీ ఉపయోగపడుతున్నాయి తప్పితే వారి విధానాలు ఏ మాత్రం సరిగా లేవని ఇది చైనాకు భవిష్యత్తులో దెబ్బ పడుతుందని ఆ బ్యాంకుల తీరు మీద.. ప్రభుత్వం వైఖరి మీద ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో చైనా ప్రభుత్వానికి ఎంతో కోపం వచ్చింది. ఆ తర్వాత నుంచి జాక్ మా జాడ కనిపించడం మానేసింది.
** ఆలీబాబా ఉత్పత్తులకు ప్రపంచంలో ఎంతో పేరుంది. అమెరికా కు చెందిన అమెజాన్ కు ఎంత పేరుందో చైనాలో ఆలీబాబా సంస్థకు అంతకంటే పెద్ద పేరుంది. ఆలీబాబా కంపెనీ నవంబరులో ఒకే రోజు సుమారు 70 బిలియన్ ల వ్యాపారం చేసింది. అదేరోజు దగ్గర్నుంచి జాక్ మా మాయమయ్యాడు.
** గతంలోనూ చైనాలో ఇలాంటి మాయా లు…, అరెస్టులు సర్వసాధారణం. గత ఏడాది చైనాకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త ఒకరు చైనా ప్రభుత్వం చేతిలో మృత్యువాత పడ్డాడు. ఆయన కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్న గోడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ప్రభుత్వం కేసు నమోదు చేయడం విశేషం. అలాగే అత్యంత ప్రజాదరణ సాధిస్తున్న చైనాకు చెందిన ఓ సినీ తార చంగ్ వా మాయమై 44 రోజుల తర్వాత చైనా జైలు కనిపించింది. పండగ వేసినందుకు ఆమెను జైల్లో పెట్టి నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటివి చైనా ప్రభుత్వానికి చాలా సర్వసాధారణమైన విషయాలే.
** జాక్ మా అదృశ్యం వెనుక రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రహస్యంగా దేశం దాటి అమెరికా లేదా ఇతర పాశ్చాత్య దేశాలకు వెళ్లిపోయారని కొందరి చెబుతుంటే ఆయనను జైల్లో పెట్టి ఉండవచ్చని చైనా ప్రభుత్వం చేసి ఉంటుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. చైనాలో మీడియా మీద ఎన్నో ఆంక్షలు ఉంటాయి. చైనాలో ఏం జరుగుతుంది అన్నది బయట ప్రపంచానికి తెలియదు. చైనా ప్రభుత్వ పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ ఒక్కటే అది కూడా ప్రభుత్వ అనుకూల వార్తలు రాస్తూనే కాలం గడుపుతుంది తప్పితే చైనాలో ఏం జరుగుతుంది అనే దానిమీద నియంతృత్వం ఉంటుంది.
దీంతో జాక్ మా అదృశ్యం కేసు విషయం బయటకు రావడం లేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అన్నది తెలియడం లేదు. అదృశ్యం అయిన రెండు నెలలకు ఆయన కనిపించకుండా పోయారని ప్రపంచానికి తెలిసింది.
కుట్ర కోణమా!!
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మీద ప్రస్తుతం ఒక కుట్ర జరుగుతున్నట్లు ప్రపంచ మీడియా చెబుతోంది. చైనా సైనిక దళం లో, కీలకంగా ఉన్న ఓ సీనియర్ అధికారి ఒకరు జిన్పింగ్ మీద కుట్ర చేస్తున్నట్లు చైనా అధ్యక్షుడికి కొన్ని వేగుల ద్వారా తెలిసిందని… దీంతో ఆయన చాలా కోపం మీద ఉన్నారని సమాచారం. అయితే ఈ కొత్త కోణంలో లోతుగా దర్యాప్తు ఇతర విషయాలు తెలుసుకున్నప్పుడు సైన్యం లో ఉన్న ఆ కుట్రదారుడు కి బయటనుంచి జాత్ మర ఆర్థికంగా సహకారం అందిస్తున్నట్లు జింగ్ పింగ్ కు తెలియడంతో నే జాక్ మాకు ఈ గతి పట్టిన ట్లు తెలుస్తోంది. అయితే చైనాలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అసలు ఏం జరిగింది అన్నది కూడా అక్కడి ప్రజలకు అంతు బట్టకుండా ఉంది. కనీసం జిన్పింగ్ ప్రభుత్వం ప్రాణాలతో ఉంచితే అతను బయటపెట్టాలని ఆయన కుటుంబీకులు అనుచరులు కోరుతున్నారు.
** ఇప్పటికే జాక్ మా ఆస్తులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ లో ఉన్న జాక్ మా ఒకేసారి తన కంపెనీ షేర్లు పతనం కావడంతో ఆస్తులు కోల్పోయి 20 వ స్థానంలోకి వచ్చారు. గత రెండు నెలల కాలంలోనే ఆయన ఆస్తులు 11 బిలియన్ డాలర్లు తగ్గినట్లు అంచనా. మొత్తం కంపెనీల ఆస్తులు సైతం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తానికి jhakmakha ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఉంటే ఆయన పరిస్థితి ఏమిటి అనేదానిమీద సర్వత్రా చైనా లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే రకమైన చర్చ నడుస్తుంది. మరోపక్క చైనా నియంతృత్వ విధానాలు దీనికి తార్కాణంగా నిలుస్తూ ఉన్నాయని తెలుస్తోంది.
0 Comments:
Post a Comment