ఎంత చెప్పినా.. రాజకీయాలే మాట్లాడుతున్న ఉద్యోగ సంఘం నేత
రాజకీయ నాయకుడి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను వ్యక్తిగతంగా కూడా దూషించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కూడా రాజకీయాలు మాట్లాడటం ఆపడం లేదు.
వార్డు మెంబర్గా కూడా గెలవలేని వారు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. పోలవరం, నవనిర్మాణ దీక్షలకు బస్సులు పెట్టి ఉద్యోగులను తరలించలేదా? అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు.
గతంలో ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా? అని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల గురించి చెడుగా మాట్లాడలేదని ఆయన అన్నారు.
what is the right the unions have to criticise SEC..?....People are fed up with the corrupt practices of employees....they are bandicoots
ReplyDelete