🌼ఫిబ్రవరిలో డైట్ విద్యార్థులకు పరీక్షలు..?
☀️పెడనగ్రామీణం: జిల్లాలో ప్రయివేటు డైట్ కళాశాలల్లో నేరుగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వచ్చే నెలలోె పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. 2018-20 ఏడాదికి సంబంధించి నేరుగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సంబంధించి గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. వీరికి రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా పరీక్షలు నిర్వహించకపోవడంతో వారు ఆందోళన చేశారు. దీంతో వీరి ప్రవేశాలపై పరీశీలన చేయమని ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డైట్ కళాశాలల్లో నేరుగా ప్రవేశాలు పొందిన వారికి సంబంధించి పరిశీలన చేసి ఇటీవల నివేదికను విద్యాశాఖకు అందజేశారు. ఈ బ్యాచ్‌కు సంబంధించి డైట్ సెట్ ద్వారా ప్రవేశాలు పొందిన వారికి ఇటీవల రెండో ఏడాది పరీక్షలు పూర్తయ్యాయి.వారు ఫలితాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. నేరుగా చేరిన వారు పరీక్షలు రాయలేక పోయారు. ప్రయివేటు డైట్ కళాశాలల్లో గతంలో యాజమాన్యాలు డైట్ సెట్ రాయక పోయినా నేరుగా ప్రవేశాలు కల్పించాయి. తరువాత ఆ ప్రవేశాలను విద్యాశాఖ నుంచి ర్యాటిఫై చేయించుకునే వారు.ఈ విధానంలో 2018-20 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది వరకు ప్రవేశాలు పొందారని సమాచారం.
☀️జిల్లాలో 30 ప్రయివేటు డైట్ కళాశాలలు ఉండగా వీటిలో 24 కళాశాలల్లో 800 మంది వరకు ఈ తరహా ప్రవేశాలు పొందారు. వీరందరికీ వచ్చే నెలలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు
0 comments:
Post a comment