పీఆర్సీ విడుదలపై ఉద్యోగుల్లో ఆందోళన
తెలంగాణలో వేతన స్థిరీకరణపై వ్యతిరేకత
ఆంధ్రప్రదేశ్లో తప్పని ఎదురుచూపులు..
ముదినేపల్లి, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి పదేళ్లకోసారి వేతన స్థిరీకరణ చేపడితే, రాష్ట్రాల్లో అయిదేళ్లకోసారి వేతన స్థిరీకరణ జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తొమ్మిదో వేతన స్థిరీకరణ అమలుకాగా... ఆపై ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో అప్పటికే రూపొందించిన పీఆర్సీ నివేదికతో రెండు రాష్ట్రాల్లో 42, 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే పదో వేతన స్థిరీకరణ జూన్ 2018తో పూర్తికాగా, 11వ పీఆర్సీకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేశాయి.
ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి రెండు రాష్ట్రాల్లో నేటికీ నూతన పీఆర్సీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. అయితే తెలంగాణలో ఏర్పాటు చేసిన కమిటీ రెండ్రోజుల కిందటే 7.5శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేస్తూ నివేదికను ప్రభుత్వానికి అందించడంతో అక్కడి ఉద్యోగుల సంఘాలు భగ్గుమన్నాయి. మన రాష్ట్రంలో కూడా కమిటీ సభ్యులు ఇప్పటికే పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి అందించగా ఎంత ఫిట్మెంట్ ప్రకటిస్తారోనని ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులు సుమారు 57,542 మందికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా... తెలంగాణలో మాదిరిగా తమకూ అన్యాయం జరుగుతుందేమోనని పలువురు వ్యాకులత చెందుతున్నారు.
ఇప్పటికే 27శాతం మధ్యంతర భృతి..
పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులకు ఇస్తుండగా, తెలంగాణలో అది ఇవ్వట్లేదు. అయితే అక్కడ డీఏలు పెండింగ్లో లేవు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాయిదాల పద్ధతిలో డీఏలు చెల్లించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
పే-రివిజనా.? రిడక్షనా..? రిటెన్షనా..?
నూతన పీఆర్సీ అంటే ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేయటం పరిపాటి. అయితే ప్రస్తుతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీ అమలులో జాప్యం చేస్తుండటం.. కమిటీ సభ్యులు ఇస్తున్న సిఫార్సుల్లో అతి స్వల్పంగా ఉండటంతో ఉద్యోగులు ఆందోళన బాటపట్టనున్నారు. వేతన స్థిరీకరణ అనేది జీతాలు పెంచేలా ఉండాలి కానీ తగ్గింపు లేదా ప్రస్తుతం ఉన్న వేతనాన్నే కొనసాగించేలా ఉంటే ప్రయోజం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ పీఆర్సీ నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఫిట్మెంట్ ప్రకటిస్తారో వేచిచూడాలని సంఘాలు చెబుతున్నాయి.
ఇక్కడి పరిస్థితి వేరు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వం అందరికీ అదనంగా ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేసింది. ఒకే కేడర్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఒక ఇంక్రిమెంట్ తక్కువలో ఉన్నారు. అయితే ఇక్కడి ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉండగా... రానున్న రోజుల్లో వీరికి కలిగే ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.
we can't believe any party. They change their mind set after coming to power. In the present scenario, employees are facing a never before and after situation.
ReplyDelete