టీచర్ల బదిలీలకు ఆటంకాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలకు పలు సవరణలతో వంద రోజులు పూర్తి కావస్తున్నప్పటికీ వెబ్ కౌన్సెలింగ్ ఇంతవరకూ ముగియలేదు. తాజాగా గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల స్టేషన్ సర్వీస్ ప్రామాణికతపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ మేరకు కోర్టు ఆదేశాలతో హెచ్ఎంల బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియకు మరో దఫా బ్రేక్ పడినట్లు అయింది. జిల్లా పరిషత్ యాజమాన్యం నుంచి మొత్తం 121 మంది హెచ్ఎంలు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా తాజాగా కోర్టు ఆదేశాలతో మరో 29 మందిని బదిలీల కౌన్సెలింగ్ కు చేర్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా వీరంతా ధరఖాస్తు చేసుకోవడానికి, వేకెన్సీల డిస్ ప్లేకు శని, ఆదివారాల్లో గడువు ఇచ్చారు. ఈనెల 11వ తేదీ నుంచి బదిలీ స్థానాల కోసం వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ఏలూరు నగరపాలక సంస్థలోకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న మండల పరిషత్, జడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ టీచర్లు మునిసిపల్ శాఖ పరిధిలోకి వస్తున్నందున, ప్రస్తుతం నిర్వహిస్తోన్న బదిలీల నుంచి తమను మినహాయించాలని మొత్తం 17 మంది టీచర్లు కోర్టును ఆశ్రయించారు. వీరిలో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ టీచర్లు కాగా, మిగతా వారంతా ఎస్జీటీలే. న్యాయ స్థాన ఆదేశాలను విద్యాశాఖ అమలు చేయకపోవడంతో ఒక ఉపాధ్యాయుని కోర్టు ధిక్కార పిటీషన్ ను దాఖలు చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫలితంగా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్లలో 17 మందిని కౌన్సెలింగ్ నుంచి తప్పించే చర్యలను ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం నుంచి పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కాండా!) అమలులోకి రావడంతో టీచర్ల బదిలీలకు మళ్ళీ ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడ్డాయి.
0 Comments:
Post a Comment